చైనా లో పుట్టిన కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో ప్రజలు మృత్యు వడిలోకి చేరుకుంటున్నారు. ప్రపంచం నలుమూలల విస్తరిస్తున్న ఈ వైరస్ ప్రస్తుతం విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ పుట్టిన చైనాలో మరణాల సంఖ్య తగ్గడమే కాకుండా పూర్తిగా ఈ వైరస్ ని నివారించారు. ఎన్నో పరిశోధనల అనంతరం ఈ వైరస్ కి అడ్డుకట్ట వేశామని చైనా చెప్తున్నా చైనా వద్ద ఈ వైరస్ కి విరుగుడు మందు ఉందని అంటోంది అమెరికా...ఇదిలాఉంటే

IHG

ఈ వైరస్ పై తీవ్ర స్థాయిలో పరిశోధనలు చేసిన చైనా కొన్ని కొత్త విషయాలని, ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది అదేంటంటే...ఈ వైరస్ ప్రభావంతో మహిళల కంటే కూడా పురుషులు అధికంగా చనిపోతున్నారని తెలిపింది. ఈ వైరస్ కి మహిళలు, పురుషులు అనే భేదం లేదు అందరిని అంటుకుంటుంది చావు వరకూ తీసుకువెళ్తుంది. కానీ చైనాలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి మరణాల గణాంకాలు లెక్కలు చూస్తే మగవారే ఎక్కువగా చనిపోయారట...

IHG

చైనాలో మొత్తం 72,314 కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 52 శాతం మంది పురుషులు, 48 శాతం మంది  స్త్రీలు ఉన్నారట. కానీ మరణించిన వారిలో అత్యధిక శాతం అంటే 63.8శాతం మంది పురుషులు ఉన్నారని తేల్చారు. కేవలం 36.2 శాతం మంది స్త్రీలు ఉన్నారట. అయితే అందుకు రీజన్ కూడా తెలిపారు. స్త్రీలు ఎక్కువగా బయటకి రారు కాబట్టి మరణాలు తక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు. ఇదిలాఉంటే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఎమింటే..పిల్లలకి ఈ వైరస్ పెద్దగా సోకలేదని, ఈ విషయం మా పరిశోధనలో తేలిందని అంటున్నారు నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: