భారతదేశం మొత్తం కరోనా భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఏ రాష్ట్రం చూసిన... ఏ  నగరం చూసిన... ఏ పల్లె చూసిన అందరిలో కరోనా వైరస్ భయమే. ఎక్కడి నుంచి దాడి చేస్తుందో ఎలా వ్యాపిస్తుందో  కూడా అర్థం కాని నేపథ్యంలో ఈ వైరస్ గురించి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా భారీగానే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మహమ్మారి వైరస్ బారిన ఇప్పటి వరకూ 30 మందికిపైగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమై పై కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఏడు మందికి పైగా ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక వైరస్ బారిన పడిన వారికి ప్రత్యేకంగా ఐసొలేషన్  వార్డులో  చికిత్సలు అందించడమే కాదు... ప్రస్తుతం ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేందుకు వైరస్ ను  నియంత్రించాలని ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. అయితే నెల్లూరులో కరోనా  వైరస్ సోకి ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆ వ్యక్తి కరోనా వైరస్ నుంచి మృత్యుంజయుడు అయ్యాడు. ప్రస్తుతం కరోనా  వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు ఆ వ్యక్తి. 14 రోజుల్లో వైద్య పరీక్షల అనంతరం కరోనా  బాధితుడికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

 

 

 రెండు సార్లు వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించినప్పటికీ రెండుసార్లు రిపోర్టులో నెగిటివ్ గానే వచ్చింది. ఇక కరోనా వైరస్ నుంచి సదరు వ్యక్తి కోల్పోవడంతో అటు  ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో  కూడా కాస్త ధైర్యం వచ్చింది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ రోజురోజుకు విజృంబిస్తూనే ఉంది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉంది. ఇక ఇటలీ ఇరాన్ లాంటి దేశాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇటలీ  దేశంలో ఇప్పటివరకూ ఏకంగా ఆరు వేల 77 మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ అమెరికా స్పెయిన్ జర్మనీ దేశాల్లో  పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: