సోమవారం రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ జే ర్యాన్ భారతదేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశానికి కరోనా వైరస్ ను ఎదుర్కొనే అత్యంత సమర్థవంతమైన శక్తి ఉందని... గతంలో స్మాల్ ఫాక్స్(small fox),  పోలియో లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఇండియా అలవోకగా అడ్డుకట్ట వేసిందని ఇప్పుడు కూడా కరోనా వైరస్ ని ఎదుర్కోగలదని ఆయనన్నారు. ర్యాన్ ఇంకా మాట్లాడుతూ... చైనా దేశంలో లాగానే ఇండియాలో కూడా జనాభా ఎక్కువగా ఉందని... జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే... అది ప్రపంచంపై దారుణమైన ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. అందుకే భారతదేశాన్ని కోవిడ్ 19 వ్యాధిపై చాలా గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘాలు, పౌర సమాజాలను సమీకరించినప్పుడు ఏ దేశమైనా ఎంత ప్రాణాంతక వ్యాధినైనా సులువుగా ఎదుర్కోగలదని ఆయన అన్నారు.




ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర అధికారులు కూడా మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతుందని... ప్రతి ఒక్క దేశం కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాలని... అప్రమత్తంగా ఉంటేనే ఈ మహమ్మారిని జయించగలమని చెప్పుకొచ్చారు. మొదటి కేసు నమోదు అయిన రోజు నుండి లక్ష కేసులు నమోదు అయ్యే వరకు 67 రోజులు పట్టగా... మరో లక్ష కేసులు కేవలం 11 రోజుల్లోనే నమోదు అయ్యాయి... ఇంకో లక్ష కేసులు కేవలం నాలుగు రోజుల్లోనే నమోదయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే కరోనా వైరస్ ఎంత వేగంగా ప్రజలకు సంక్రమిస్తుందో అర్థం చేసుకోవచ్చు.




భారతదేశంలో సోమవారం వరకు 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. ఐతే పోలీసు అధికారులు 24 గంటలు తమ విధులు నిర్వహిస్తూ... ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలని ఆపి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మొన్న ఢిల్లీలో రోడ్లపై తిరిగే ప్రజలకు చాలా చక్కగా కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించిన పోలీసు అధికారులు అందరి మన్ననలను పొందారు. ఇతర దేశాలలో లాగా ఎవరైనా బయట తిరుగుతూ కనిపించగానే చంపేసే(షూట్ ఎట్ సైట్)పరిస్థితిని మనదేశంలో రానివ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమవ్వాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: