మన దేశంలో కరోనా వైరస్ 30 కోట్ల మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ తీవ్రత అనేది ఏ మాత్రం అంచనా వేయలేని స్థితిలో ఉంది. ఇప్పటికి పరిస్థితి చేయి దాటిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మన దేశంలో కరోనా ఇప్పుడు మన చేతుల్లో లేదు. అన్ని విధాలుగా కరోన వైరస్ వ్యాపిస్తుంది. ఎండలు ఉన్నా సరే అది మాత్రం అదుపులో కి వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనపడటం లేదు. అయితే దీనిపై పలువురు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. 

 

దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే 30 కోట్ల మంది కొవిడ్‌ బారిన పడతారని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ(సీడీడీఈపీ) డైరెక్టర్‌ రమణన్‌ లక్ష్మీనారాయణన్ తాజాగా ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంఖ్యను 20 కోట్లకు తగ్గించవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అమెరికా, బ్రిటన్‌లో వైరస్‌ వ్యాప్తిని భారతదేశ పరిస్థితులకు అన్వయించిన ఆయన ఈ వివరాలు అనేవి ప్రకటించారు. భారతీయులు ఏటా కొన్ని కోట్ల మంది ఫ్లూ బారిన పడతారన్న ఆయన...

 

కానీ కరోనా వైరస్‌ కొత్తదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వైరస్ కు సంబంధించి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) చాలా తక్కువని అన్నారు ఆయన. అందుకే అది అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.  ఈ 30 కోట్ల లో మూడో వంతు కేసులు తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు చేపడితే ఇది నెమ్మదిగా వ్యాపించి, వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లేకుంటే స్వల్ప వ్యవధిలో లక్షల మందికి సోకి, 25 లక్షల మంది దాకా మృత్యువాత పడొచ్చన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: