తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ను  అరికట్టేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ పై  పోరాటం చేసేందుకు రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని కోరుతూ.. రెండు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను పాటించిన విధంగానే మార్చి 31 వరకూ లాక్ డౌన్  పాటించాలని పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల  ప్రభుత్వాలు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి రాష్ట్ర ప్రజలందరికీ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలని సూచించినప్పటికీ... ప్రభుత్వ నిబంధనలు మాత్రం ఎవరూ పాటించడం లేదు. 

 

 

 ప్రజలందరూ వాహనాలతో రోడ్ల పైకి చేరుకున్నారు.. దీంతో ప్రజలందరినీ కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రోడ్ల మీదకి వస్తున్న ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు గొంతు పోయేలా అరుస్తూన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనాలు పోలీసులు హెచ్చరిస్తునప్పటికీ పరిస్థితిలో లేదు. అయితే ఇలా ప్రజలను హెచ్చరిస్తున్న పోలీసుల ప్రాణాల మీదికి కూడా వస్తుంది. ఓ వాహనదారులు చూపించిన దూకుడుకు పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

 

 విజయవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ మారెప్ప పాడు చెక్పోస్ట్ దగ్గర ప్రజలెవరూ తిరగకుండా  ఉండేందుకు పోలీసులు అక్కడ వాహనాలను నిలువరించి ఇంటికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారెప్పపాడు చెక్పోస్ట్ దగ్గర కి క్వాలిస్ వాహనంలో వచ్చిన ఓ వాహనదారుడు దూకుడు చూపించాడు. ఏకంగా పోలీసుల మీదికి దూసుకుపోవడంతో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వాహనన్ని  అడ్డగించి  సన్నీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీధర్ కు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి కోసమే లాక్ డౌన్  పాటించాలని రక్షణ కల్పిస్తున్న పోలీసులకు  రక్షణ లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: