కొంతకాలం బ్రతకండని చెబుతుంటే చావుకు ఎదురెళ్లు తున్నారు.. భయం లేని మనుషులు.. ఒక వైపు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంటే కొందరు మూర్ఖులు మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.. ఉంటే ఉంటాం.. లేకుంటే చస్తాం అనే మాటలు కరెక్ట్ కాదని కూడా ఆలోచించడం లేదు.. ఇప్పుడు ప్రపంచం ప్రమాదం అంచున నిలబడింది.. కనీసం ఆలోచనతో ముందుకు సాగితే మనుషులు బ్రతుకుతారు.. నాకేంటి అని అనుకుంటే శవాలే మిగులుతాయి..

 

 

ఇకపోతే కరోనా వ్యాప్తికి అధిక కారణం విదేశాల నుండి వస్తున్న వారి వల్లనే అనే విషయం తెలిసిందే.. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు తమకు సమాచారం ఇవ్వాలని, 14రోజుల పాటు సెల్ప్ క్వారంటైన్ పాటించాలని అధికారులు ఆదేశాలిచ్చినా కొందరు పట్టించుకోవడం లేదు.. ఇలాంటి మూర్ఖుల కారణంగా వ్యాధి మరింతగా వ్యాపిస్తుంది.. అందుకు నిదర్శనం ఇటీవల సింగపూర్‌లో ఉంటున్న ఓ వివాహిత హైదరాబాద్‌కు ఒంటరిగా వచ్చింది. ఆమె చేతికి ఎయిర్‌పోర్టులో ముద్ర వేసినా, క్వారంటైన్ పాటించకుండా, బాయ్‌ఫ్రెండ్‌తో చిందులు వేస్తూ స్థానికులకు పట్టుబడింది. సోమవారం బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతుంది..

 

 

ఆ వివరాలు తెలుసుకుంటే నిజామాబాద్‌‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా భర్త, పిల్లలతో పాటుగా సింగపూర్‌లో నివసిస్తోంది. కాగా  సెలవులపై సింగపూర్‌ నుండి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్టులో ఉన్న అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేసి ఇంట్లోనే ఉండాలని చెబుతూ, చేతిపై ముద్ర వేసి  పంపారు. కానీ బరితెగించిన ఈ ఆడది తన సొంత ఊరుకు వెళ్లకుండా ఓల్డ్‌ బోయినపల్లి రాజారెడ్డి కాలనీలోగల సాయిరెసిడెన్సీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉండటమే కాకుండా ఆదివారం రాత్రి హస్మత్‌పేటకు చెందిన ఓ యువకుడిని ఫ్లాట్‌కు రప్పించుకుని ఎంజాయ్ చేస్తుంది.. అసలే భయం గుప్పిట బ్రతుకున్న ప్రజలు ఇలాంటి చర్యలవల్ల ఇంకా భయకంపితులవడం ఖాయం..

 

 

అందుకే ఈ విషయాన్ని వీరుంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు గమనించిన మహిళను నిలదీశారు. అంతే కాకుండా ఆమె చేతికి ఉన్న క్వారంటైన్‌ స్టాంపును గమనించి, వెంటనే పోలీసులకు ఫోన్ చేసారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళతో పాటు, యువకుడిని విచారించగా, అతను ఆమె ప్రియుడని, అతడితో కలిసి ఎంజాయ్ చేసేందుకే ఆమె తన స్వస్థలానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించిన బోయినపల్లి పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.. చూసారా ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పండి.. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారు ఉన్నారు కాబట్టి మనదేశానికి ఇప్పుడు కరోనా అనే ప్రమాదం ముంచుకొచ్చింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: