రాష్ట్రంలో కరోనా నివారణ కోసం లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఇంటికి పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తేనే వైరస్‌ వ్యాపించడం తగ్గుముఖం పడుతుంది. అయితే అక్కడక్కడ కొంత మంది దీనిని పాటించడం లేదని తెలుస్తోంది. ఇంట్లో ఉండటమే శ్రేయస్కరం అని, కనీస బాధ్యత అని అందరికీ తెలియజెప్పాలి.  పోలీస్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. 13.8 శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారిలో 4.7 శాతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

 

ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలు రాకుండా అడ్డుకోవాలి. గూడ్సు, నిత్యావసర వస్తువులతో కూడిన వాహనాలు తప్ప ఏవీ తిరగరాదు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ మూసేయాలి. కనీస అవసరాలు కొనుగోలు చేసేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే వచ్చేలా చూడాలని ఆయన అన్నారు.  ప్రజలకు కొన్ని రోజులు కష్టం అనిపించి.. భవిష్యత్ సుఖంగా ఉంటుంది.  తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడినా కరోనా వైరస్ ప్రబలిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రజలంతా అర్థం చేసుకొని తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.  కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా కోరారు.

 

అధికారులు క్షేత్ర స్థాయిలో కోవిడ్‌ –19 నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షించాలి. అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి.  కరోనా సోకిన వారిలో 80.9 శాతం మంది హోం ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారని తెలిపారు. కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అందులో కేవలం 4.7 శాతం మంది మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 450 వెంటిలేటర్లతో పాటు 1300 బెడ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: