కరోనా వైరస్ విషయంలో కేంద్రప్రభుత్వం తొందరలో సంచలన నిర్ణయం ప్రకటించనున్నదా ?  ఒకటి రెండు రోజుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించే విషయమై ప్రధానమంత్రి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.  మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించకపోతే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్  నాధ్ కోవింద్ భవన్లోని ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారట.

 

నిజానికి మనదేశంలో జనాలు ఒక పట్టాన మాట వినేరకాలు కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  మొన్నటి రోజున ఈ విషయం తాజాగా రుజువైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పిన మాట ప్రకారం ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించిన జనాలు సాయంత్రం తర్వాత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు. ఎప్పుడైతే జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారో విపరీతమైన రద్దీ వచ్చేసింది. దాంతో ఉదయం నుండి పాటించిన జనతా కర్ఫ్యూ స్పూర్తి పూర్తిగా దెబ్బ తినేసింది.

 

ఆదివారం అంటే ఏదో జరిగిపోయిందని అనుకుంటే మళ్ళీ సోమవారం ఉదయం నుండి జనాలంతా రోడ్లపైనే కనిపించారు. ఎక్కడ చూసినా జనాలు గుంపులు గుంపులే. దానికి తోడు కూరగాయల మార్కెట్లపై ఒక్కసారిగా దాడులు చేసినట్లు మీద పడ్డారు. దాంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఒక్కసారిగా మండిపోయింది. అప్పటికీ ప్రభుత్వాలు జనాలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నా పట్టించుకోవటం లేదు. క్వారంటైన్ సెంటర్లలో ఉండమని, ఐసోలేషన్ సెంటర్లు, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా జనాలు పట్టించుకోవటం లేదు. మనదేశంలో లాక్ డౌన్, షట్ డౌన్ లాంటివి పనిచేయవన్న విషయం అందరికీ తెలిసిందే.

 

జాగ్రత్తలు పాటించటంలో జనాలకే ఛాయిస్ ఇస్తే దేశంలో కరోనా వైరస్ ప్రబలిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న రెండోస్టేజ్ లోని వైరస్ ను నియంత్రించాలంటే ప్రభుత్వం వల్ల కాదు. ఒకసారంటూ వైరస్ మూడో దశకు  చేరుకుంటే మరణాలను నియింత్రించటం ఎవరి వల్లా కాదు. అందుకనే కేంద్రం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ విధించే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు  సమాచారం.  రాష్ట్రపతి ఓకే చెప్పేస్తే ఒకటి రెండు రోజుల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: