తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 33కి చేరింది. రాష్ట్రంలో ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు.. కానీ కొంత మంది మాత్రం దీనిపై అవగాహన లేకనో.. వస్తే ఏమవుతుందన్న లెక్కలేని తనమో రోడ్లపైకి వస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి లాక్ డౌన్ విషయంలో పోలీస్ అధికారులు కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. రవాణా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తామని అన్నారు.

 

 

ఇలాగే ప్రవర్తిస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. త్యావసరాల కొనుగోలు నిమిత్తం సమీపంలో ఉన్న దుకాణాలకే వెళ్లాలి తప్ప దూర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.  రాష్ట్రంలో ’కరోనా‘ రెండో దశలో ఉందని, స్వీయనియంత్రణ, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే  ఈ విపత్తును అడ్డుకోవచ్చని ప్రజలకు సూచించారు. వైరస్ నన్నేమి చేస్తుందులే అని రోడ్లపైకి వస్తే ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పంజాబ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించి 144 సెక్షన్ విధించింది.

 

అయినా కొంతమంది ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో వాళ్లను పోలీసులు నడి రోడ్డుపైనే బోర్లా పడుకోపెట్టారు.  దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. బయటకు వచ్చిన వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తూ.. మళ్లీ బయట తిరం బాబోయ్ అనే పరిస్థితికి తీసుకు వస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి తగలెయ్య కంటిమీద కునుకు లేకుండా చేస్తుందిరా బాబో అంటున్నబాధపడుతున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: