చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ పుట్టింట్లో ఉండకుండా ప్రపంచమంతా తిరిగి వణికించేస్తోంది. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కొని లక్షలమంది ఆస్పత్రిపాలయ్యారు. కొన్ని వేలమంది ఈ ఆస్పత్రి బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.. 

 

IHG

 

ఇటలీ వంటి దేశాల్లో రోజుకు 500 మందికిపైగా మృతి చెందుతున్నారు. ఇంకా అలాంటి కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో అన్ని ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను ఎవరిని ఇంటి నుండి బయటకు రానివ్వకుండా తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ అయ్యాయి. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. లాక్ డౌన్ పరిస్థితులపై ఈరోజు మధ్యాహ్నం సమీక్షలు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎదురవుతోన్న సమస్యలపై దృష్టిసారించారు కేసీఆర్. ఆ సమస్యల పరిష్కారంకై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. 

 

IHG

 

ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనంతరం సాయింత్రం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: