క‌రోనా వైర‌స్‌కు బ్రేక్ వేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎన్నో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌ డౌన్ ప్రకటించిన చాలా మంది ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ రోడ్లమీదకు వచ్చారు. తెలంగాణ‌ ప్రభుత్వం ఇప్పటికే బైక్ పై ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రయాణం చేయకూడదు అని... అలాగే కార్లలో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణం చేయకూడదని ప్రకటించింది. ఆయన హైదరాబాద్ ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ బయటికి వచ్చేశారు. చాలా చోట్ల అయితే బైక్ పై ఇద్దరు ముగ్గురు కలిసి రోడ్లమీద హల్చల్ చేస్తున్నారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి నుంచి లాఠీచార్జి చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

 

ఇక సోమ‌వారం సాయంత్రం నుంచే ప్ర‌భుత్వ ఆదేశాలు పాటించ కుండా రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారిని పోలీసులు లాఠీల‌తో చిత్తుగా చిత్తుగా వాయించ‌డం మొద‌లు పెట్టారు. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి వైర‌ల్ అవుతుండ‌డంతో చాలా మంది బాబు మ‌నం కూడా ఇప్పుడు బ‌య‌ట‌కు వెళితే మ‌న‌కు కూడా చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయిరా ?  బాబు అని బ‌య‌ట‌కు వెళ్లేందుకు జంకుతోన్న ప‌రిస్థితి. 

 

ఇక ఇప్ప‌టికే చాలా చోట్ల బైకులు సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. మ‌రింత క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల కోసం అవ‌స‌ర‌మైతే యేడాది జైలు శిక్ష కూడా వేస్తామ‌న్న నిబంధ‌న అమ‌ల్లోకి తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయి. యేడాది జైలు శిక్ష‌తో పాటు భారీ జ‌రిమానాలు కూడా విధించ‌నున్నారు. ఏదేమైనా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల కోసం ఇంత చేస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న చేసి అందుకు స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో మ‌న‌మంద‌రం మ‌న ప్రాణాలు కాపాడుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: