ప్రపంచ వ్యాప్తంగా 200 కు పైగా దేశాలను హడలెత్తిస్తున్నకరోనా వైరస్ భారత దేశాన్ని కూడా హడలెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో  క‌రోనా పాజిటివ్ కేసులు 500 క్రాస్ అయ్యాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు సైతం కరోనా వైరస్ విస్తరించింది. లండన్ నుంచి వచ్చిన 23 సంవత్సరాల మ‌ణిపూర్ యువ‌తికి క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్టు నిర్ధారించారు. ఇక మ‌న దేశంలో ఇప్ప‌టికే 30కు పైగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ఇక ప్ర‌జా జీవ‌నం సైతం బ్రేక్ ప‌డింది.



చాలా రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి చూస్తే తెలంగాణలో ఇప్ప‌టికే 33 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఏపీలోనూ ఈ సంఖ్య 7కు చేరుకుంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డికి మోదీ చాలా సీరియ‌స్‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఆదివారం దేశం అంతా జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించేలా మోదీ పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక మోదీ పిలుపు మేర‌కు దేశం అంతా జ‌న‌తా క‌ర్ఫూ పాటించి ఆయ‌న పిలుపు న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు క‌రోనా కోసం తాము సైతం పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాయి.



ఇక గ‌త శుక్ర‌వార‌మే మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగం చేశారు. క‌రోనా కోసం అంద‌రూ క‌లిసి రావాల‌ని.. అంద‌రూ క‌లిసి పోరాటం చేస్తేనే క‌రోనాకు క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే మోదీ మ‌రోసారి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగం చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఆయ‌న మ‌రోసారి త‌న ప్ర‌సంగాన్ని జాతికి అందించ నున్నారు. మోదీ ప్ర‌ధాన మంత్రి హోదాలో జాతిని ఉద్దేశించి వారంలో రెండోసారి ప్ర‌సంగం చేయ‌నున్నారు. ఇది ఓ రికార్డుగా నిలిచింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: