క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచం మొత్తం హ‌డ‌లెత్తిస్తోంది. అస‌లు క‌రోనా పుట్టిన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఇప్పుడు ఒక్క కేసు కూడా న‌మోదు కావ‌డం లేదు. ప్ర‌పంచ దేశాల‌ను గ‌డగ‌డ లాడిస్తోన్న క‌రోనా ఇప్ప‌టికే 192  దేశాల‌కు విస్త‌రించింది. ఎంత దారుణం అంటే క‌రోనా పుట్టిన చైనా ఇప్ప‌టికే ఆ వైర‌స్‌ను పూర్తి గా కంట్రోల్ చేసి త‌న ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే ఇదే క‌రోనా దెబ్బ‌తో ఇట‌లీ మాత్రం విల‌విల్లాడి పోతోంది. ఇటలీలో క‌రోనా దెబ్బ‌తో మ‌ర‌ణ మృందంగ‌మే న‌డుస్తోంది. ఇక ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు లేక‌పోవ‌డంతో ఇట‌లీలో క‌రోనా మృతులు రోజుకు వంద‌ల్లోనే ఉంటున్నారు.

 

ఇక మ‌న దేశంలో మ‌హారాష్ట్ర‌, కేర‌ళ లాంటి రాష్ట్రాల్లో మూడో ద‌శ‌లోకి వెళ్లిపోయింది. ఇప్ప‌టికే స్థానికుల‌కు కూడా ఈ వైర‌స్ సోకుతోంది. మ‌న‌దేశంలో ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న ప్ర‌జ‌లు ఇప్ప‌ట‌కి అయినా మేలుకొని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు సోష‌ల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో క‌రోనా ఇప్ప‌టికే జోరందుకుంది. అక్క‌డ 33 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌భుత్వం తీవ్ర చ‌ర్య‌ల‌కు దిగింది.

 

ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌స్తే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే వీటిల్లో మూడు కేసులు కీల‌క న‌గ‌రం అయిన విశాఖ‌లోనే న‌మోదు అయ్యాయి. ఆ న‌గ‌రంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారితో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన వారు కూడా ఎక్కువుగా ఉన్నారు. ప‌లు కేంద్ర సంస్థ‌లు కూడా ఉన్నాయి. వీటిని ఇంకా లాక్ డౌన్ చేయ‌లేదు. పైగా విశాఖ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌భుత్వం కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో ?  విశాఖ‌లో కూడా అలాగే ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌క‌పోతే అక్క‌డ ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌ర జోన్‌లోకి వెళ‌తాయ‌న్న ఆందోళ‌న కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటలీ త‌ర‌హా ప‌రిస్థితి మ‌న‌కు రాకూడ‌దంటే అటు ప్ర‌భుత్వం.. ఇటు ప్ర‌జ‌లు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుని క‌రోనాకు బ్రేక్ వేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: