ఇప్పటి వరకు జనాబా లెక్కలు,  సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటి సర్వే జరగనుంది. కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా.. ఉంటే వారి వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.  దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి భయం రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఇప్పటికే పలు నియంత్రణా చర్యలు ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తయారు చేయాలని నిర్ణయించింది.  కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా రాష్ట్రం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్రంగా ఈరోజు (మార్చి24, మంగళవారం) నుంచి ఇంటింటీ సర్వే నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రతరమవుతోంది. నిన్న కొత్త మూడు కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 21 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇలా ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా సోకడం జరుగుతుంది. విదేశా నుంచి వచ్చిన వారికే ఈ ఎఫెక్ట్ ఘోరంగా ఉంది. టువంటి వ్బారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఇటువంటి వారి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వీరి వివరాల కోసం..  మరోమారు ఇంటింటి సర్వేను జరిపించనుంది.

 

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 27 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎంఎలు ఈ సర్వే కోసం పని చేయనున్నారు. మంగళవారం నుంచి ఈ సర్వే పనులు ప్రారంభం అవుతాయని, కరోనా వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా, ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారి వివరాలతో రిపోర్ట్ ను వీరు తయారు చేస్తారని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  కాగా, లాక్ డౌన్ లో భాగంగా గాంధీ, ఫీవర్, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను, నాన్ ఎమర్జెన్సీ సర్జరీలను నిలిపివేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: