గత ఆదివారం, బెంగాల్ లో జరిగిన ఈ సంఘటన ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. నెటిజన్లు ఆమె సాహసానికి, ధర్యానికి ఫిదా అవుతున్నారు. దేశం మొత్తం జనతా కర్ఫ్యూని ఎంతో నిజాయితీగా పాటిస్తున్నవేళ, రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో బెంగాల్, జల్పాయ్‌గురిలోని ఒంటరిగా ఉన్న ఓ మహిళ  ఇంట్లోకి ఇద్దరు కామాంధులు ప్రవేశించారు. వాళ్లిద్దరూ లోపల అడుగుపెట్టగానే, ఆమె ఎవరు మీరు... ఏం కావాలని అడిగింది..

 

వెంటనే వారు తలుపు గడియ పెట్టడంతో, విషయం అర్ధమైన ఆమె గట్టిగా అరవగా.. ఆ ఇద్దరిలో ఒకడు ఆమె నోరు నొక్కి... బలంగా నొక్కి పట్టుకోగా.. మరొకడు ఆమె కాళ్లను గట్టిగా పట్టుకొని, ఆలా ఆమెను బెడ్ రూంలోకి లాక్కుపోయి, బెడ్ రూం తలుపు వేయడంతో... ఆమె తీవ్రంగా ప్రతిఘటిద్దామని ప్రయత్నిస్తున్నా... ఇద్దరూ ఆ అవకాశం ఇవ్వకుండా బలాత్కారం చేయబోయారు. ఆ క్షణంలో ఏం చేస్తే వాళ్ల బారినుండి  తప్పించుకోవచ్చో ఆమెకు అర్థం కాక... మనసులో ఎన్నో రకాల ఆలోచనలు మెదులుతుండగానే వారిలో  ఒకడు ఆమెపైకి దూకి, ముద్దు పెట్టుకోవాలని యత్నించగా... ఆమె... ఒక్కసారిగా అతని నాలుకను బలంగా కొరికేయడంతో దెబ్బకు అతని నాలుక రెండు ముక్కలుగా తెగి పడింది.

 

ఇక దాంతో సదరు వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం అవ్వగా, భరించలేని బాధతో వాడు అక్కడినుండి, ఒక్క ఉదుటున.. మంచంపై నుండి దుమికి, తెగి పడిన నాలుక ముక్కను వెదికి పట్టుకుని... తలుపులు తెరచి పారిపోయాడు. ఇక మిగిలినవాడు కూడా జరిగిన తంతును చూసి అవాక్కయి... బ్రతుకు జీవుడా అంటూ... అక్కడినుండి తప్పించుకున్నాడు. తెగిపడిన నాలికతో బాధితుడు జల్పాయ్‌గురి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి వెళ్లగా.. డాక్టర్లు అతని నాలుకను సర్జరీ చెయ్యలేకపోయారు. 

 

చాలా ఆలస్యమైందనీ, తెగిన ముక్కలోని కణాలు పూర్తిగా డైల్యూట్ అవడం వలన దాన్ని సెట్ చెయ్యలేమని చెప్పగా.... తదుపరి అతన్ని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు పంపారు. ఆ ఇద్దరూ స్థానికులే అన్న విషయాన్ని పంచాయితీ మెంబర్ రంజిత్ రాయ్ గుర్తించి, వాళ్లకు కఠిన శిక్షలు వెయ్యాలని పోలీసు శాఖ వారిని కోరగా, పోలీసులు ఇంకా FIR నమోదు చెయ్యలేదని, వారు బడా నేతలకు చెందిన వారుగా అనుమానం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదిఏమైనా సదరు మహిళ చాకచక్యాన్ని ఈ సందర్భంగా మెచ్చుకొని తీరాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: