తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో వెంకటేష్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దశాబ్ధాల కాలం నుంచి స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని  మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను  సంపాదించుకున్న హీరో వెంకటేష్. ముఖ్యంగా ఫ్యామిలీకథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన వెంకటేష్ తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటికీ ఎక్కడ క్రేజ్ తగ్గకుండా యువ హీరోలకు సైతం పోటీ ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో యువ హీరో లతో మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువగా నటిస్తున్న వెంకటేష్ మంచి విజయాలను అందుకోవడమే కాదు యువ హీరోలను సైతం డామినేట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. 

 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోలలో ఒకరు వెంకటేష్. అయితే సీనియర్ హీరోలు అయినప్పటికీ దశాబ్ధాల కాలం నుంచి ప్రేక్షకులను మెప్పిస్తూనే  ఉన్నారు వెంకటేష్ నాగార్జున,చిరంజీవి, బాలకృష్ణలు. ఇక పారితోషికం విషయంలో కూడా యువ హీరోలకు పోటీ పడుతున్నాడు వెంకీ. ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన వెంకటేష్ ఆ తర్వాత... వెంకీ మామ సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో పారితోషకాన్ని  వెంకటేష్ భారీగానే పెంచినట్లు తెలుస్తోంది. ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటూ ప్రస్తుతం సీనియర్ హీరో అయినప్పటికీ రోజురోజుకు మార్కెట్  పెంచుకుంటున్నాడు వెంకటేష్. 

 

 

 

 అయితే ఎఫ్ 2 సినిమా కి 10 కోట్ల పారితోషికాన్ని వెంకటేష్ డిమాండ్ చేశాడట. కానీ దిల్ రాజుతో వెంకటేష్ కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా తన పారితోషికాన్ని వెంకటేష్ కాస్త తగ్గించినట్లు సమాచారం. కానీ ఆ తర్వాత సినిమా నుంచి మాత్రం పది కోట్లకు తక్కువ తీసుకోవడం లేదట వెంకటేష్. ఇక వెంకటేష్ తీస్తున్న సినిమాలు కూడా మంచి విజయం అందుకుంటుండడంతో.. వెంకటేష్ కి  అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదట  దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జున ఒకటి రెండు మంచి హిట్లు పడితే పారితోషికాన్ని పెంచే అవకాశం లేకపోలేదు అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఇక చిరంజీవి పారితోషకం అయితే ఎక్కువగానే ఉంటుంది బాలకృష్ణ కూడా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా పారితోషికం తీసుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: