కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా జనజీవితం అతలాకుతలం అవుతోంది. సామాన్యులు ఎవరూ బయటకి రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాయి. అయితే జనాలు ఇళ్లకే పరిమితం అయినా... పోలీస్, వైద్య, రెవెన్యూ సిబ్బందికి రోడ్ల మీదే తిరగాల్సిన పరిస్థితి ఉంది. వీరితో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసందంగా పనిచేసే మీడియా సిబ్బంది పరిస్థితి మాత్రం ఈ కరోనా కర్ఫ్యులో అధ్వాన్నంగా మారింది. ఈ మేరకు జర్నిలిస్ట్ లు, ఇతర మీడియా సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలోనూ, జర్నలిస్ట్ ల వాట్సాప్ గ్రూపుల్లోనూ వ్యంగ్యంగా పోస్టింగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. వారి బాధ ఏంటో ఓ సారి చదివేద్దాం !

 


ప్రతీవాడికీ లోకువే..

ఓరే కరోనా వచ్చింది. 
అందరూ కొంపలో చావండి అంటే...
పనీపాటా లేని ఎదవలంతా రోడ్లపైనే ..
అత్యవసర సేవల పేరుతో...
మనకేమో తప్పని డ్యూటీ..
బస్సులు లేవు..  ఆటోలు, ట్యాక్సీలు బంద్..
బండే దిక్కు..  
కొంపకాడ స్టార్ట్ చేస్తే... ఇగ మొదలు
ప్రతీ మెయిన్ జంక్షన్ లో పోలీసులకు ఎక్స్ ప్లెనేషన్స్ ఇస్తూ..ఇస్తూ.. 
దొంగల్నో.. ఆవారా గాళ్లనో చూసినట్టు వాళ్ల చూపుల్ని భరిస్తూ... 
ఒళ్లీడ్చుకుంటూ ఆపీసుకు చేరాక...
అబ్బో బార్డర్ లో యుద్ధం చేసి గెలిచొచ్చినంత ఫీలింగ్.. 

చచ్చీ చెడీ.. పెళ్లాం పిల్లల్లి కొంపలో వదిలి పనికి పోతే...
అంతలోనే .. కమాన్ కరోనా అన్నట్టు గా కళకళలాడుతున్న డెస్క్ లు  చూసి
ఆశ్చర్యంతో కూడిన సంబరంతో సంబంధం లేని భయం 

ఎక్కడ? ఎప్పుడు? ఎవరు కరోనా అంటించి పోతాడో.. 
తెలియని ప్రాణభయం..
జనానికి చెప్పి చచ్చే .. సోషల్ డిస్టెన్సింగ్  మనకు అవకాశం లేక...
ఎవడు దగ్గినా... తుమ్మినా... 
ఎటు నుంచి కరోనా మహమ్మారి ..
పట్టేసుకుంటుందోనని బెంబేలు( లిట్రల్ గా చెప్పలంటే.. కింద తడిసిపోతుంటే..)
ఐనా తప్పదు కదా... బతుకు దెరువాయే
లేదంటే బతుకు బరువాయె.

అలా.. డెస్క్ పురంలో..


చాయ్ కి.. హాయికీ వగసీ..
సిగరెట్లకు నాలుకలు పీక్కుపోయి.. 
టిక్కూ.. టిక్కుమంటూ కీ బోర్డుతో కుస్తీ...
లైవ్్ లు, .. బులెటిన్లు.. వార్తలతో జబర్దస్తీ..

షిఫ్ట్ ముగుస్తుందనగా.. మళ్లీ టెన్షన్ మొదలు..
తర్వాత షిఫ్ట్ వాళ్లు .. చేరుకుంటారో.. చేరకుంటా ఆపేయబడుతారో..
స్వీట్ పెయిన్... లాట్ స్ట్రెయిన్

కళ్లముందు ఆ శాల్తీ కనబడగానే
ఓ హౌజ్  ఈఎంఐ తీరిపోయినట్టో..  పర్సనల్ లోన్ శాంక్షనైనట్టో.. 
అవ్యక్తానందానుభూతి. సంభ్రమాశ్చర్యాలకు గురైనంత భ్రాంతి

ఇగ ఔట్ పంచ్ కొట్టాక..
రయ్ మంటూ కొంపకేగగా...
అప్పుడేమందయ్యా అంటే..
(తందాన తానా.. తకధిమి తకదిమి తై)
దారి పోడవునా..  (అయ్యో ..)

అలా డెస్క్ జీవి సాగుతూ ఉంటే...
బాటబాటనా.. ఖాకీలు ( సామీ)
చిరాకు చూపులూ.. శీలపరీక్షలు..( తందానా... తాన తందనానా..)
అంతలో ఏమైందయ్యా అంటే...
చప్పునా ... ఓ పోలీసు ఆపినాడు రా...
ఈ రాత్రి ఏంపనిరా .. (beep..beep.. beep) అంటూ పలికినాడురా..( అయ్యో.. అయ్యో..)

వయసుకు విలువైన ఇయ్యలేదురా.. (( అయ్యో.. అయ్యో..).
ఏవరో .. ఎక్కడి నుంచి వస్తున్నాడో కనుక్కోలేదురా..
( అయ్యో.. అయ్యో..).
 
చేతిలో కర్రను ఎత్త్తితినాడురా ( తందానా... తాన తందనానా..)
 బర్రెనో, గొర్రెనో తోలినట్టే గెదిమినాడురా..( తందానా... తాన తందనానా..)
నేను ఫలానా అయ్యా అన్నా పట్టించుకోలేదురా ( తందానా... తాన తందనానా..)
నీ లాగే తప్పక పనిచేసి.. ఇళ్లకు పోతున్నామని చెబుతున్నా వినలేదురా ... 
( తందానా... తాన తందనానా..)
ఐడీ కార్డ్ చూపిస్తున్నా  చూడాలేదురా ..( తందానా... తాన తందనానా..)
తరికిట తరికిట జం..

ఇప్పుడు మన డెస్క్ జీవి ఏం చేశాడయా అంటే..
ఏం చేద్దాం వాళ్ల విధి "విధానం" అనుకున్నాడయ్యా
( అంతకంటే పీకేదేమీ లేదు కదా.. సెల్ఫ్ ఓదార్పన్నమాట)//( తందానా... తాన తందనానా..)
బతుకుజీవుడా అనుకొని మన హౌజుకు చేరినాడయ్యా//( తందానా... తాన తందనానా..)
....
ఇంతలో... 
మళ్లీ .. రేపు సేమ్ ఎపిసోడ్ .. 'టు బీ కంటిన్యూడ్' 
అని గుర్తొచ్చినాదయ్యా ...(అయ్యో ..)
అప్పుడు తన హౌజులోని .. మ్యాన్షన్ హౌజు గుర్తొచ్చినాదయ్యా..( సామీ)
గడగడా రెండు పెగ్గులు పీకినాక.... 

దాన వీర శూర కర్ణ సినిమాలో ...  ఆఫ్టర్ మయ సభ సీన్ స్టార్ట్..
హా... విధీ... హతవిధి 
అత్యవసర సేవల పరిధిలోకి నా కొలువేల రావలె
నాకేల లాక్్ డౌన్ వర్తించక పోవలె..
నేనేల డ్యూటీకి  పోవలె... 
పోయితిని పో...
మార్గమధ్యమున బారీకేడ్ల వద్ద పోలీసులను చూసి..
మననేమీ అనడులే అని విర్ర వీగవలె..
ఐడీ కార్డు చూపితే వదిలేయునులే అని ఎలా భ్రమపడవలె..
హఠాత్ పరిణామంతో మా మానసమేల అపభ్రమనం చెందవలె..
అయ్యో..
హృదయ శల్యాభిమానములైన ఆ పోలీసుల మాటలు..
నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.
హా విధి.. హా హతవిధీ..

మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. 
లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మారు నించుటయా..
ఇస్సీ.. 
ఇప్పుడేదీ కర్తవ్యము ? మళ్లీ షిఫ్టుకేగుటయా? మూసుకుండుటయా ?


 ఓ పోలీసన్నా జర్నలిస్టులపై దాడులు ఆపండి ... మేం కూడా ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే 24గంటలు పని చేస్తున్నాం .... 

ఒకవైపు విధినిర్వహణ.. మరోవైపు ఫ్యామిలీ టెన్షన్స్..
వెంటాడుతున్న కరోనా మహమ్మారి. 
ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నాం.
 Time.. place.. situation తో సంబంధం లేకుండా క్షణాల్లో ఘటనా స్థలంలో వాలిపోతున్నాం. 
నిన్న జనాలు కొట్టిన చప్పట్లు.. తాళాలు.. డప్పుల శబ్దాల్లో మేము లేకపోయినా.. ప్రపంచానికి చూపింది మాత్రం మేమే.
టీవీలు చూసే జనాలు గుర్తించకపోయినా పర్వాలేదు.. 
ఓ పోలీసన్నా.. మీతోపాటు మేమూ పనిచేస్తున్నామని గుర్తించండి. కరోనా మహమ్మారి ముందు ఎవరైనా ఒకటే.. మీరూ జాగ్రత్తగా ఉండండి...
( కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. మీడియా కి అనుమతి ఉందని.... క్లియర్ గా జివోలో ఇచ్చాయి) 

 

అత్యవసర సర్వీస్ విభాగం వారు డ్యూటీలో ఉంటారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి.. లాక్ డౌన్ లో వారు డ్యూటీలు చేసుకోవచ్చు అన్నారు. మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి.. మీడియా అని ఐడి కార్డులు చూపిస్తుంటే మా ప్రాణాలమీదకు వస్తోంది. కార్డు చూపించుకొని మరి తన్నులు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మనా బూతులు తిడుతూ పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అయ్యా మేము తీసుకు వచ్చే వీడియోస్, మీరు మాట్లాడే వీడియోస్ అన్ని మేము అందిస్తేనే కదా జనాలకు తెలిసేది. జనం జాగ్రత్త పడేది. మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే అనుమతి ఇస్తున్నారు. తరువాత మీ కింద సిబ్బంది గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. ఏంది స్వామి ఈ బాధ. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు ఉంది మీ వ్యవహారం. మీ పీసీ లు అయ్యాక మాతో పనిలేదన్నట్లు పరోక్ష దాడి చేయిస్తే ఎలా.. బయటకి రాకపోతే మాకు ఉద్యోగం ఉండదు. వస్తే మీ పోలీస్ కింద సిబ్బంది చేతిలో చావు. ఇప్పటికే కొన్ని సంస్థలు మాకు జీతాలు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా పని చేస్తున్నాము. మీ దెబ్బలకు భయపడి ఇంట్లో ఉంటే ఇవ్వాలని ఆలోచనకుడా మా బాస్ లు చేయరు. కాస్త మీ కింద సిబ్బందికి చెప్పండి నాయనా.. కరోనా నిదానంగా మనిషిని చంపుతుంది.. మీ వాళ్ళు మమ్మల్ని ఒకే సారి చంపేస్తున్నారు. సోషల్ మీడియాని కట్టడి చేసి నిజమైన ఛానల్స్ కి కార్డు ఉంటే వదిలి పెట్టమని ఓ జర్నలిస్ట్ ఆవేదన

మరింత సమాచారం తెలుసుకోండి: