ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తూ  ఎంతో మంది ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్న మహమ్మారి వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా శరవేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన చాలామంది కారణంగా కరోనా  వైరస్ భారత్ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం విజృంభిస్తోంది  ఎంతో మంది ప్రజలను మృత్యువుతో పోరాడేలా  చేస్తుంది. ఇలా రోజురోజుకు మహమ్మారి వైరస్ వ్యాప్తి  పెరిగిపోతున్న నేపథ్యంలో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వీయ నిర్బంధంలోకి  కూడా వెళ్లిపోయాయి. 

 

 

 ఇకపోతే ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమై పోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే రోడ్డుపైన తిరుగుతున్న చాలామంది జనాలను పోలీసులు బాగా అవగాహన కల్పించి మరి ఇంటికి వెళ్లాలి అంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు.. ఓవైపు డాక్టర్లు ఎంతగా కృషి చేస్తున్నారో... ప్రస్తుతం పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. 

 

 

 ప్రాణాలు కాపాడే డాక్టర్లను దేవుడు అంటారు... కానీ ప్రస్తుతం ప్రజలందరికీ డాక్టర్లతో పాటు పోలీసులు, పారిశుధ్య కార్మికులు కూడా దేవుల్లుగా  మారిపోయారు. కరోనా  వైరస్ అంటువ్యాధి అని తెలిసినప్పటికీ.. కరోనా వైరస్ సోకితే  ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పటికీ కూడా... తమ ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో సాహసం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. డాక్టర్లు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ  ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే.. పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోడ్డుపైన వెళ్తున్న వారిని నివారిస్తూ వారికి అవగాహన కల్పించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇక పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ పారిశుద్ధ్య పనులు చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ప్రాణాల మీదకు రాకుండా చూస్తున్నారు. అందుకే వీరే ప్రజల ప్రాణాలు కాపాడుతున్న దేవుళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: