ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఐటి కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చారు. ఆ సమయంలో విధులను నిర్వహించటానికి  వైఫై కనెక్షన్ తప్పనిసరి అవసరం. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకుని ఉండవచ్చు.

 

మీరు రూటర్ ప్రక్కన నిలబడినప్పుడు మాత్రమే సిగ్నల్ వస్తుంటే ముందుగా రూటర్ ఉన్న లొకేషన్ ప్రాంతాన్ని మార్చాలి. అలా చేయటం వల్ల రూటర్ యెుక్క వైర్ లైస్ కవరేజీ పై ప్రభావం చూపుతుంది. సిగ్నల్ మంచిగా రావటం కోసం రూటర్ ని ఇంటి మధ్యలో గోడలకు దూరంగా ఉంచండి. అలాగే రూటర్ దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా చూసుకోండి.

 

మీ రూటర్ అనేది డ్యూయల్ బ్యాండ్ పని తీరును గురించి తెలుసుకోవాలి. ఇవి సాధారణంగా బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 2.4GHz బదులుగా 5GHz గా ఉంటుంది. కాబట్టి మీరు అవసరాని బట్టి రూటర్ యెుక్క ఫ్రీక్వెన్సీ ఎంచుకోవాలి.

 

మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ అవటానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు.

 

ఇప్పుడు ఉపయోగించే ఆధునిక రూటర్స్ లో మీరు విడియో కాల్స్, ఫైల్స్ డౌన్ లోడ్ చేయటానికి కావల్సిన క్వాలీటీని సెట్ చేసుకోవచ్చు.  అంతేకాకుండా మీరు ఏదైనా లాంగ్ ఫైల్ ని డౌన్ లోడ్ చేయాలనుకున్నాడు వీడియో స్ట్రీమింగ్ ఆగదు.

 

మీ రూటర్ ని అప్ గ్రేడ్ చేయటం, హార్డ వేర్ ని మార్చటం మంచిది. మీ రూటర్ కి డైరెక్టగా యాంటీనా కనెక్షన్ ఇవ్వటం వల్ల సిగ్నల్ మంచిగా వస్తుంది. వైఫై కవరేజీని పెంచేందుకు రిపీటర్స్, ఎక్స్‌టెండర్స్ ఉపయోగించొచ్చు. మీ ఇంట్లో ఎక్కువ డెడ్‌జోన్స్ ఉన్నట్టైతే ఇవి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: