కరోనా ప్రభావం ఏపీలో మంత్రులపైనా పడుతోంది. వారిలో కొందరు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఫోన్లపైనే రాష్ట్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. మొబైళ్లతోనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి వారిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు . ఆయన తిరుపతిలోని తన ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

 

పెద్దిరెడ్డికి తిరుపతిలో సొంత ఇళ్లుంది. ఆయన అక్కడి నుంచే స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. అవసరమైన వారితో ఫోన్లలో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ దూర దృష్టితో వ్యవహరించి వలంటీర్ల వ్యవస్థ పెట్టడం వల్ల, గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల కరోనా సమస్యను అదుపు చేయడానికి ఎక్కువ అవకాశం వచ్చిందంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

 

కష్టకాలంలో బాగా పని చేస్తున్న వాలంటీర్లను మంత్రి అభినందించారు. విదేశాల నుంచి ఎవరు వచ్చారన్న సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందించడంలో వాలంటీర్ల సేవలు మరువలేని వంటూ పెద్ది రెడ్డి కితాబిచ్చారు. కరోనా ప్రభావంతో హోం క్వారంటైన్ ఉండటం మంచిదే కానీ.. రాష్ట్రం మొత్తం పరిపాలనను అంచనా వేయాల్సిన మంత్రులు ఇళ్ల నుంచే ఈ వ్యవహారాలు సమర్థంగా చక్కబెడతారా లేక.. పరిపాలన కేంద్రమైన రాజధాని నుంచి నిర్వహిస్తే బావుంటుందా అన్నది ఆలోచించాలి.

 

 

ఇలాంటి ఆపద సమయాల్లో మంత్రులు యాక్టివ్ గా ఉంటూనే కిందిస్థాయి యంత్రాంగం చురుకుగా పని చేస్తుంది. మనం బాగా పని చేయడమే కాదు.. ఆ విషయం జనంలోకి కూడా బాగా వెళ్లాలి. అప్పుడే.. వారిలోనూ సీరియస్ నెస్ వస్తుంది. ఇది ఏమాత్రం ఉపేక్షించే వైరస్ కాదు.. అలాగే ఉపేక్షించాల్సిన సమయమూ కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: