ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా పుట్టుకకు కారణం అయిన చైనా ఇప్పుడు మరో వైరస్ కలకలం సృష్టిస్తుంది.  వైరస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది చైనా.  చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోన్న సంగతి తెల్సిందే. కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి.  ప్రపంచంలో ఇప్పటికే 15 వేలకు పైగా మరణాలు సంబవించాయి.  మూడు లక్షలకు పైగా ఈ కరోనా వైరస్ భారిన పడ్డట్టు తెలుపుతున్నారు.  కరోనాను అరికట్టేందుకు అన్ని దేశాలు యాంటీ డోస్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు చైనాలో మరో కొత్త భయం మొదలైంది. అక్కడ  హంటా వైరస్ లక్షణాలతో చైనాలో ఒకరు మరణించారని తెలుస్తోంది. మరో 32 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయట. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. 33మంది ప్రయాణికుల బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ లక్షణాలతో కొన్ని గంటల్లోనే మరణించాడు. 

 

అయితే ఈ  హంటా వైరస్ లక్షణాలు ఉన్నవారిని  గుర్తించి వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు.   ఇక హంటా లక్షణాలు ఉన్నవారు మరో 32 మందిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఏది ఏమైనా ఇప్పుడు ఒక్క వైరస్ కే ప్రపంచం బెంబేలెత్తిపోతుందటే.. కొత్తగా ఈ హంటా ఏంట్రా బాబో అని జనాలు మళ్లీ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కరోనా వైరస్ భయానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: