భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తన పరిధిని పెంచుకుంటూ పోతూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఇక వేరే దారి లేక లాక్ డౌన్ ప్రకటించాయి. మరొకవైపు ప్రజలంతా విపత్కర సమయంలో తమ కుటుంబాలు ఎలా గడుస్తాయో అంటూ వాపోతున్నారు. పేద ప్రజలు అయితే తన సంసారం గడపడం కష్టతరంగా మారిన నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కానీ దేశ ప్రజలంతా సంయమనంతో వ్యవహరిస్తూ ఇంటికే పరిమితం కావడంతో వైరస్ త్వరలోనే తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నారు.

 

ఇటువంటి సమయంలో స్వీయ నిర్బంధనతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమైన నేపథ్యంలో ప్రభుత్వాలు తమకు చేతనైన రీతిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసింది. తమ రాష్ట్రంలోని పేదల ప్రజలకు శానిటైజర్లు మరియు మాస్క్ లను కొనుగోలు చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం కుటుంబానికి 500 రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం అక్కడి ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

పేదలు శానిటైజర్లు ,మాస్క్ లు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని భావించిన ప్రభుత్వం 500 రూపాయల చొప్పున ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు. వీటిని పేదల బ్యాంక్ ఖాతాలలో వేస్తామని ప్రకటించింది. కాగా పంజాబ్,రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కూడా కేవలం అత్యవసర సర్వీసుల కోసమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు  దేశంలో లాక్ డౌన్ ప్రకటించేసారు. పంజాబ్ మరియు మహారాష్ట్ర మాత్రం పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: