ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వెనులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటివరకు 167 దేశాలకు విస్తరించి అక్కడ మరణమృదంగాన్ని మోగిస్తోంది. తాజాగా ఈరోజు వరకు కరోనా బాధిత కేసులు 3,30,000 మందికి పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ వలన చనిపోయిన వారి సంఖ్య 14,700 దాటింది. ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 99 వేల మందికి పైగా ఉందని అంచనా.. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ వలన ఎక్కువగా చనిపోయిన వారిలో ఇటలీ దేశం ముందుంది. ఆ దేశ మరణాల సంఖ్య 5476. 

 

మన భారత దేశంలో సోమవారం 10.30 గంటల వరకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు నమోదు చేసిన ప్రకారం ఇప్పటివరకు 415 మందికి సోకింది. తెలంగాణాలో 23 మందికి ఈ వైరస్ సోకిందని రిపోర్టులు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ వైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉంటే లేదా ఈ వ్యాధి సోకిందని మీరు భావిస్తే ఈ లక్షణాలను ఎలా గుర్తించాలి తెలుసుకోండి. 

 

కరోనా అన్ని వైరస్ ల లాగా గాలిలో ప్రయాణించలేదు. కానీ ఈ వైరస్ ఎవరికైతే సోకిందో వారితో నేరుగా మాట్లాడినట్లయితే వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేరుగా అంటే వ్యాధి వచ్చిన వ్యక్తితో దగ్గరగా  కలిసి మాట్లాడటం. ఈ వ్యక్తికి రెండుమీటర్ల దూరంలో ఉంది మాట్లాడాలని అలాగే వారితో 15 నిముషాల కన్నా ఎక్కువ సేపు ఉండటం వలన వైరస్ సోకే ప్రమాదముందని యూకే నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తుంపర్లలో కరోనావైరస్ కణాలు ఉంటాయి కాబట్టి వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేస్తే మనకొచ్చే ప్రమాదముంది. వస్తువులను తాకినప్పుడు వెంటనే ఆ చేతిని ముఖాన్ని తాకకముందే చేతులను కడుక్కోవటం వలన వైరస్ తొలగిపోతుంది.


మనకి ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే టిష్యూ పేపర్ ను లేదా మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని బిన్ లో వేయాలి. ఈ వైరస్ ను కట్టడి చేయటానికి ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: