ప్రపంచలో ఇప్పుడు కరోనా వైరస్ చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  ఎక్కడ చూసినా కరోనా ముచ్చటే కొనసాగుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడిక్కడే ప్రజలు ఇంటిపట్టున ఉంటున్నారు.  బయటకు వచ్చిన వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు. వాహనాలు సీజ్ చేసి మరి ఫైన్లు వేస్తున్నారు.. మరీ మాట్లాడితే జైలు శిక్ష అంటున్నారు.  ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది.  తాజాగా దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు ప్రకటించారు.

 

దేశంపై కరోనా పంజా విసురుతుండగా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం స్థానిక సంస్థల నిధులను విడుదల చేసింది. పారిశుద్ధ్య పనుల కోసం కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల పట్టణ, గ్రామీణ సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. బ్యాంకుల్లో ఇకపై కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో డబ్బు తీసుకోవచ్చని, 3 నెలల పాటు చార్జీలు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

 

ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఎలాంటి రుసుం ఉండబోదని అన్నారు. అయితే కరోనా ప్రభావంతో కేంద్ర సర్కార్‌కు స్థానిక సంస్థల నిధులు విడుదల చేయక తప్పలేదు.  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మినిమమ్ బ్యాలన్స్ నిబంధన తొలగించడం, ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించడం సామాన్యుడికి ఊరట కలిగించనుంది.ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: