ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టతరంగా మారింది. ఒకవేళ బ్యాంకు అకౌంట్ లో మినిమమ్ బాలన్స్ మెయింటైన్ చేయకపోతే చార్జీలు వసూలు చేస్తారు. దీంతో ఖాతా వినియోగదారులకు టెన్షన్ కలుగుతోంది. అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక గొప్ప వరం ప్రకటించింది. ప్రస్తుత భారత దేశంలో కరోనా వైరస్ వీపరీతంగా విస్తరిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ చేసిన పరిస్థితులు తెలిసిందే.. దీంతో ఎవరికి వారు వారి ఇళ్లకే పరిమితం అయ్యారు.

 

 దేశంలో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.  మన దేశంలోనే కాక ప్రస్తుత ప్రపంచ దేశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో నిర్మలా సీతారామన్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. అది ఏంటంటే.. బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బాలన్స్ చార్జీలను ఎత్తివేయటం. ఇలా మినిమమ్ బాలన్స్ చార్జీలను ఎత్తివేయటమే కాక పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో బ్యాంకు ఖాతాదారులు తప్పనిసరి పరిస్థితులు ఎదురైతేనే బ్యాంకులకు వెళ్లాలని లేదంటే ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.

 

 ఇక ఇప్పటి నుంచి ఏ బ్యాంకు ఖాతాదారులైనా కూడా ఎటువంటి ఏటీఎం లలో అయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఈ సదుపాయాన్ని మూడు నెలల వరకు అంకితం చేశారు. అప్పట్లో వేరే బ్యాంకు ఖాతాదారు ఆ బ్యాంకు ఏటీఎంలో పరిమితికి మించి డబ్బులు డ్రా చేస్తే చార్జీలు వర్తించేవి.. కానీ.. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేశారు. 

 

అయితే.. మనకి సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి చివరి రోజుతో ముగుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 30 వరకు పొడిగించారు. దింతో పాటుగా ఆధార్ పాన్ లింక్ చేయటానికి కూడా గడువును జూన్ 30 వరకు పొడిగించారు.      

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: