తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎక్కడిక్కడ వైరస్ ని అదుపు చేయడానికి ఏ నిర్ణయం తీసుకోవడానికి అయినా ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల 20 వరకు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు హీరోయిన్లను ముంబై నుంచి గాని ఇతర ప్రాంతాల నుంచి గానీ రానీయవద్దు అని పలువురు కోరుతున్నారు. మహారాష్ట్రలో కరోనా ఎక్కువగా ఉంది. బెంగళూరు లో కూడా కరోనా వైరస్ ఎక్కువగానే ఉంది. దీనితో అక్కడి నుంచి ఎవరైతే వస్తారో వారిని కట్టడి చేయడానికి గానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సినిమా చర్చల గురించి గానీ మరో చర్చ గురించి గాని ఎవరూ కూడా రావొద్దని తమ తమ ప్రాంతాల్లో ఉంటే అందరికి మంచిది అని బర్త్ డే పార్టీలు ఆ పార్టీపార్టీ అంటూ ఏదీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారు. 

 

ప్రజల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇక అవసరమైతే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అవగాహన కూడా కల్పిస్తే మంచిది అని కోరుతున్నారు. ప్రజలు అందరూ కూడా కరోనా విషయ౦ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునే విధంగా తమ సోషల్ మీడియాను వాడే విధంగా చెయ్యాలని కోరుతున్నారు. హీరోయిన్స్ విమానాల్లో గాని కారుల్లో గాని అసలు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మన దేశంలో కట్టడి లోనే ఉందని, కాబట్టి దాన్ని మరింత రెచ్చగొట్టకుండా అందరూ కూడా సహకారాలు అందించాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: