ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని అస్తవ్యస్తంగా తయారుచేసిన కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో మన జనాలకు ఎక్కడం లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్న వారు సెలవులు ఇచ్చింది షికార్లు చేయడానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. వైద్య నిపుణులు మరియు అధికారులు, పోలీసు వారు ఎంతగా హెచ్చరిస్తున్నా వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. వారికి ఇటలీలో ప్రస్తుతం నెలకొన్న భయంకరమైన పరిస్థితులు చూస్తే కానీ అసలు పరిస్థితి అర్థం కాదని పలువురు చెబుతున్నారు.

 

 

ప్రస్తుతం మన దేశంలో స్టేజ్-2 లో ఉన్న కరోనా వైరస్ విజృంభించకుండా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే చైనాలో వైరస్ విజృంభిస్తున్న సమయంలో కొన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకున్నా ఇటలీ సరిగ్గా స్టేజ్-2 లోనే అసలు పట్టించుకోనే లేదు. తమకు ఏం కాదు అన్న అహంకారం వారందరిలో కనిపించింది. పైగా హోమ్ క్వారంటైన్ అనేది రాతియుగం నాటి విధానమని అది అసలు అనవసరమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అయితే దేశ ప్రధాని చిలక కి చెప్పినట్టు చెప్పిన మాటలను పూర్తిగా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లిస్తున్నారు.

 

ఇటలీలో మారణహోమం ఒక రేంజ్ లో ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతం అయితే స్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా మరియు వైరస్ ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కనిపిస్తున్నాయి.  దీంతో కరోనా సోకిన వృద్ధులకు చికిత్స చేయలేక అలా వదిలేసే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా ఒక అంశమైతే.. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా అక్కడ కనిపించడంలేదు.

 

కుప్పలుతెప్పలుగా వస్తున్న మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం ఉండటంలేదు. ఇక విద్యుత్ శ్మశానవాటికలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దీంతో శ్మశానానికి వస్తున్న శవాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. కొన్నాళ్లపాటు మీ ఇంట్లోనే శవాన్ని భద్రపరచాలని, మీ వంతు వచ్చిన తర్వాత తీసుకురావాలని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: