పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లిల్లో చుట్టాలు, స్నేహితులు అంతా సంబరంగా ఉంటారు.. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ తర్వాత ఎంతో ఎంజాయ్ మెంట్ చేస్తారు. బారాత్ తో కొత్త దంపతుల ఆనందాలనికి అవధులు ఉండవు.. తమ స్నేహితులు, బంధువులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.  అయితే ఇప్పుడు దేశంలో కరోనా ప్రభావంతో పెళ్లి అంటే కిలో మీటర్ దూరం ఉరుకుతున్నారు. కొన్ని పెళ్లిళ్లు క్యాన్స్ చేసుకుంటున్నారు.. మరికొంత మంది తమ కుటుంబ సభ్యుల మద్యనే చేసుకుంటున్నారు.  తాజాగా ఓ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకొని రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు... పోలీసులు వచ్చి మనోడిని బొక్కలో తోశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఈ గానా భజానాలు, విందులు ఏంటని ప్రశ్నిస్తూ, ఏకంగా వరుడినే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడంతో బంధుమిత్రులంతా కంగుతిన్నారు.

 

ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, కంధమల్ జిల్లా, నౌపాద గ్రామంలో పరమేశ్వర్ భుక్తా అనే యువకుడి పెళ్లి రిసెప్షన్ కు ఏర్పాట్లు జరిగాయి. ఈ విందుకు సుమారు 80 మంది వరకూ గ్రామస్తులు హాజరయ్యారు. అక్కడ ఇప్పటికే ఏడుగురి కన్నా ఎక్కువ మంది ఓ ప్రాంతంలో చేరవద్దని ఒడిశా సర్కారు ఆదేశించి వుండటంతో, విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రిసెప్షన్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, వరుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ చేసి ప్రజలంగా సంఘీభావం వ్యక్తం చేస్తుంటే పెళ్లి పేరంటాలంటూ ఎంజాయ్ చేస్తున్నారా అంటూ పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కరోనా వ్యాప్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటిమీద కునుకు లేకుండా పని చేస్తుంటే ఇలా వివాహ మహోత్సవాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమాచారం తెలుసుకొని రిసెప్షన్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి, వరుడిని పోలీసు స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: