ఇప్పుడు మన దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకి పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని చెప్పవచ్చు. నేడు మన దేశంలో కరోనా మరణాల సంఖ్య పదికి చేరింది. అలాగే కోవిడ్ భారిన పడిన వ్యక్తుల సంఖ్య ఏకంగా ఐదు వందల పైకి చేరుకుంది. కాగా నేడు కరోనా వైరస్ బారిన పడడంతో ముంబయిలో ఆసుపత్రిలో మరో వ్యక్తి కూడా మరిణించాడు. ఈ వ్యక్తి మరణించడంతో దేశం మొత్తం మీద కరోనా వైరస్ మృతుల సంఖ్య 10 కి చేరుకుంది.

 

 


నిజానికి మహారాష్ట్రలో ఇది కోవిడ్ కారణంగా సంభవించిన మూడో మరణం. దేశంలో కరోనా వైరస్ అధికంగా తీవ్రత కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఎక్కుగా ఉంది. నేడు  ముంబయి ప్రాంతంలో ఉన్న వ్యక్తి(65) కరోనా వైరస్‌ తో బాధపడుతూ నేడు మృతి చెందాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. సదరు వ్యక్తి కొన్ని రోజుల కిత్రం uae నుంచి అహ్మాదాబాద్ కి చేరుకున్నాడు అని సమాచారం. భారత్ కి వచ్చిన తర్వాత అతనికి జ్వరం, దగ్గు ఎక్కువ అవ్వడంతో ముంబయిలోని ఒక ఆస్పత్రిలో చేరాడు.

 

 


దీనితో అతనికి కరోనా పరీక్షల నిమిత్తం బ్లడ్ పరీక్షల రిపోర్ట్స్ ప్రకారం అనంతరం అతనికి కరోనా పాజిటివ్అని తేలింది. దీనితో అతడు గత నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్న అతను దాని తీవ్రతకు కోలుకోలేక మరణించాడు. ఇక ఇది ఇలా ఉంటే మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం సెంచరీ దాటింది నేటితో. ప్రస్తుతం మొక్క మహారాష్ట్ర లోనే కేసుల సంఖ్య 106 కు చేరింది. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర వైద్యశాఖ కూడా పేర్కొంది. ఏది ఏమైనా మనం మనవంతు జాగ్రత్తలు తీసుకొంత వరకూ మనం ఈ మహమ్మారి భారిన పడక తప్పదు. కాబట్టి మన వంతు సహకారం అందిద్దాము.

మరింత సమాచారం తెలుసుకోండి: