ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించి తెగ బెదిరిపోతుంది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం మీద ఉన్న అన్ని రాజ్యాలు యుద్ధం చేస్తున్నాయి ఇంట్లో కూర్చుని. ఒకానొక సమయంలో యుద్ధమంటే సరిహద్దుల్లో ఒకరిపై ఒకరు బాంబులు వేసుకునేవాలు. టెక్నాలజీ రావడంతో ప్రస్తుతం...ప్రపంచంలో అభివృద్ధి తో పాటు యుద్ధ పద్ధతులు కూడా మారిపోయాయి. ఎక్కడినుండి పుట్టిందో ఏమో తెలియదు గానీ...కరోనా వైరస్ భూమి మీద ఉన్న ప్రజలను గజగజ లాడిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్న ఇండియాలో ఈ మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది.

 

జనతా కర్ఫ్యూ విధిస్తూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు చాలా రాష్ట్రాలలో ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి తరుణంలో ప్రపంచమంతా కరోనా వైరస్ పై పోరాడుతుంటే జగన్ మాత్రం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై సి.బి.ఐ ఎంక్వయిరీ వేస్తూ, జీవో ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో భూముల అవకతవకలు జరిగాయని, సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొందరు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

 

ఈ కేసులో సీఐడీ.. ఐపీసీ సెక్షన్లు 420, 506ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. ప్రస్తుతం వీటన్నిటిపైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకపక్క ప్రపంచం కరుణ వైరస్ తో విలవిలలాడుతుంటే ఇటువంటి టైములో ఇలాంటి నిర్ణయాలు దేనికి అంటూ జగన్ పై సీరియస్ అవుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు ముఖ్యం ఏపీ ముఖ్యమంత్రికి అని విమర్శలు చేస్తున్నారు. జగన్ వైఖరి చూస్తుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కర్తవ్యం గుర్తుకొస్తోంది అంటూ టిడిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: