అవును తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటే కుదరదు. సందర్భానుసారం, ప్రత్యర్ధిని బట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు మార్చుకుంటు పోవాల్సిందే. లేకపోతే కోర్టులో ఎదురు దెబ్బలు తగినట్లు తగులుతునే ఉంటాయి. నిజానికి కోర్టు వేసిన మొట్టికాయల్లో కొన్ని స్వయం కృతమనే చెప్పాలి.  ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయమని ఎవరు చెప్పారు ?   ఇటువంటి చర్యలను  ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా ? కాబట్టి మొదట్లో కోర్టు చెప్పినపుడే జగన్ అందుకు బాధ్యులను కంట్రోల్ చేసుంటే ఇపుడీ పరిస్ధితి ఎదురయ్యేదే కాదు.

 

అలాగే ప్రభుత్వం పెదలకు పంపిణి చేయాల్సిన పట్టాలను ఐదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చని లేకపోతే కుదవ పెట్టుకోవచ్చని ఏ ప్రభుత్వమైనా లబ్దిదారులకు వెసులుబాటు ఇస్తుందా ? ఎవరైనా కేసు వేస్తే కోర్టు చూస్తు ఊరుకుంటుందా ? నిజానికి పేదలకు ప్రభుత్వం ఇచ్చే పట్టాలను చాలామంది అమ్మేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడా కొన్నవాడు కొనుకున్నాట్లు, అమ్మినవాళ్ళు అమ్ముకున్నట్లు చెప్పరు.

 

మరి ఈ విషయం జగన్ కు తెలీకుండానే ఉంటుందా ? తెలిసినపుడు అమ్ముకోవచ్చు, కుదవపెట్టుకోవచ్చనే వెసులుబాటు ఎందుకు కల్పించినట్లు ? దీన్నే న్యాయస్ధానం అడ్డుకున్నది.  ఇక్కడ జగన్ గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే తాను చేయదలచుకున్న ప్రతిదాన్ని ప్రత్యర్ధులు కోర్టులో సవాలు చేయచ్చని. పరిపాలనా పరంగా జగన్ ను అడ్డుకోలేమన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమయ్యే కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. జగన్ ను కోర్టుల ద్వారా మాత్రమే అడ్డుకోగలమని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే అటునుండి నరుక్కుని వస్తున్నాడు.

 

  ఈ విషయాన్ని జగన్ బాగా అర్ధం చేసుకోవాలి. చంద్రబాబు బలమేంటి ? బలహీనతేంటి ? అనే విషయం బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి కాస్త జాగ్రత్తగా పావులు కదపాలి.  చంద్రబాబు మీద పై చెయ్యి సాధించాలంటే ప్రతి విషయాన్ని  జగన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అందుకనే ముందుగా సరైన సలహాదారులను పెట్టుకోవాలి, వాళ్ళ సలహాలను వినాలి. వినటానికి ముందు కాస్త చేదుగానే ఉన్న కోర్టులో కానీ ఇంకే రూపంలో అయినా కాని ఎదురు దెబ్బ తినకూడదంటే మంచి సలహాలను విని పాటించాల్సిందే. లేకపోతే కోర్టులో మొట్టికాయల పడుతునే ఉంటాయనటంలో సందేహం అవసరం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: