ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రాకాసి వైరస్ కరోనా ప్రస్తుతం భారత్ ను అతలాకుతలం చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంచలన కీలక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత మూడు రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. ఎందుకంటే ఈ రాకాసి వైరస్ ను అంతం చెయ్యాలి అంటే ఇంట్లోనే ఉండాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి.. శుభ్రంగా ఉండాలి కాబట్టి. 

 

ఇలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉన్నందుకు చైనా వంటి దేశాల్లో ఎంతమంది ప్రజలు మృతి చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇటలీ అయితే శ్మశానంలా తయారయ్యింది అంటే నమ్మండి. పాపం అక్కడి అధికారులు ఈ కరోనా వైరస్ ను అదుపు చెయ్యలేక కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు పాపం. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి ప్రజలు సహకరించకుంటే కరోనా వైరస్ ను అంతం చెయ్యలేం అని కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం లాక్ డౌన్ పై సమీక్షా నిర్వహించిన కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ నేడు మరి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏంటి అంటే? 

 

తెలంగాణాలో ప్రజలు మాట వినకపోతే మాత్రం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని కేసిఆర్ కీలక ప్రకటన చేసారు. 

 

రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని కేసిఆర్ ప్రకటించారు. 

 

ఇప్పుడు ప్రజలు మాట వినకపోతే మాత్రం 24 గంటలు కర్ఫ్యూ విధిస్తామని అప్పటికి వినకపోతే కాల్చి చంపేస్తామని కేసిఆర్ కీలక హెచ్చరికలు జారీ చేసారు.

 

ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా వ్యవహరిస్తున్నామని.. మాట వినకుంటే ఆర్మీ ని దించుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

 

సమాజానికి ఇబ్బంది కలిగే విధంగా చేస్తే మాత్రం ఎలాంటి లైసెన్స్ లు అయినా రద్దు చేస్తామని స్పష్టం చేసారు. 

 

ప్రజలందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన అందరి పాస్ పోర్ట్ లు కలెక్టరేట్ లో ఉండాలని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: