తెలంగాణ‌లో క‌రోనా ను కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ తీవ్ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ నిర్ణ‌యం స‌క్సెస్ అయ్యింది. అయితే సోమ‌వారం నుంచి జ‌నాలు రోడ్ల మీద‌కు వ‌చ్చేశారు. కేసీఆర్ ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించినా చాలా మంది ఈ నిర్ణ‌యం పాటించ లేదు. చివ‌ర‌కు పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేశారు. దీంతో కేసీఆర్ తీవ్ర నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌లేదు. మంగ‌ళ‌వారం ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ స‌మాజానికి హిత‌వు ప‌ల‌క‌డంతో పాటు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు.

 

తెలంగాణ రైతులు మార్కెట్ క‌మిటీల‌కు రావొద్దు.. వాళ్ల‌కు ఊల్ల‌లోనే కూప‌న్లు ఇస్తారు అని ఆయ‌న తెలిపారు. ఇక ప్ర‌స్తుతం బ్లాక్ మార్కెట్ ఎక్కువుగా జ‌రుగుతోంది. దీంతో ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కోసం చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. అన్ని రేట్లు బాగా పెరిగి పోయాయి. దీంతో కేసీఆర్ ఎక్కువ రేట్ల‌కు అమ్మే వారికి వార్నింగ్ ఇచ్చారు. నిత్యావ‌స‌రాలు అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తే  వాళ్ల‌ను బ్లాక్ లిస్టులో పెట్టి పీడీ యాక్టులు పెడ‌తాం అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే వాళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం అని కూడా చెప్పారు.

 

అయితే కేసీఆర్ ఈ రోజు రాత్రి మాత్రం స‌రిహ‌ద్దుల్లో చెక్ పోస్టులు ఎత్తి వేస్తున్న‌ట్టు చెప్పారు. స‌రిహ‌ద్దుల్లో ఆదిలాబాద్ వ‌ద్ద 3 వేల వాహ‌నాలు ఉండ‌డంతో ఈ ఒక్క రోజు ఆ చెక్ పోస్టు ఎత్తి వేస్తున్నామ‌న్నారు. ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఆటంకం లేదన్నారు. అది కూడా రైతులు ప‌నులు గుంపులు గుంపులు కాకుండా చూసుకోవాల‌న్నారు. ఇక కూలీల‌కు ఉపాధి కోసం న‌రేగా ప‌నుల‌ను కూడా కొనసాగిస్తాం అన్నారు. అలాగే ఇరిగేష‌న్ ప్రాజెక్టు ప‌నులు కంటిన్యూ అవుతాయి.. అక్క‌డ కూడా హై శానిటైజేష‌న్ ఉంటుంద‌న్నారు. అయినా ప్ర‌జ‌లు విన‌క‌పోతే షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్స్ జారీ చేస్తామ‌ని.. ఆ ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: