కరోనా వ్యాధి కట్టడి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఈ నెల 31 వతేదీ వరకు  లాక్ డౌన్ ప్రకటించాయి . అయితే 31 వ  తేదీ తరువాత పరిస్థితి ఏమిటీ?, కరోనా అప్పటి వరకు కట్టడి అయిపోతుందా ?? అన్న చర్చ సర్వత్రా  కొనసాగుతోంది . ఈ నెలాఖరుతో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించిన  లాక్ డౌన్ ముగుస్తుందా ? లేకపోతే పొడిగిస్తారా ?? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోంది .  ఒకవేళ లాక్ డౌన్  పొడిగిస్తే రోజు వారి కూలీలు , మధ్యతరగతి వేతన జీవుల పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు .

 

కరోనా బాధితుల సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు , దేశంలోను శరవేగంగా పెరుగుతోన్న నేపధ్యం లో ఇప్పుడప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు . కరోనా బాధితులందరికీ , ఈ వ్యాధి  నయమయ్యాక, మరొక్క కేసు కూడా నమోదయ్యే  పరిస్థితి లేదని తెలిసినప్పుడే ప్రజలు  స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొననుంది . అయితే వందకోట్లకుపైచిలుకు జనాభా ఉన్నఈ దేశం లో అనుమానితులను గుర్తించి , వారికి వ్యాధి నయమయ్యే వరకు క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యల ఈ వేసవి ముగిసే వరకు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . అప్పటి వరకూ  ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు .

 

అదే జరిగితే రోజువారీ కూలీలు , వేతన జీవులు ఇబ్బందులు ఎదుర్కొనే  పరిస్థితి  నెలకొననున్నాయి . మరో నెల , రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే రోజువారీ కూలీలు , వేతన జీవులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది . ప్రస్తుతానికైతే రెండు రాష్ట్రాలు రేషన్ తో పాటు కొంత నగదు సహాయం చేస్తామని ప్రకటించాయి . ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారా ?, లేకపోతే మరింత మెరుగైన ప్యాకేజీ  ప్రకటిస్తారా ?? అన్నది హాట్ టాఫిక్ గా మారింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: