జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సమాజానికి చాలా విషయాలు చెప్పారు. భారత సమాజం బ్రతికి ఉదయాన్ని చూడాలి అంటే కచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ని కచ్చితంగా పాటించాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రధాని స్థాయిలో ఉండి మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశానికి చాలా విషయాలు చెప్పింది. ఆయన చెప్పింది గనుక పాటించకపోతే మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. 21 రోజులు లాక్ డౌన్ అని ప్రకటించారు. ఏప్రిల్ 14 వరకు ఇది కొనసాగుతుంది అని మోడీ వివరించారు. 

 

ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండాలని మోడీ ప్రజలు అందరిని విజ్ఞప్తి చేసారు. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఏ మందులు అయినా వాడాలని ఇల్లు వదిలి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని మోడీ స్పష్టంగా చెప్పారు. ప్రతీ వీధి ప్రతీ ఊరు, ప్రతీ గ్రామ౦ ప్రతీ పట్టణం అన్నీ కూడా లాక్ డౌన్ అని మోడీ పేర్కొన్నారు. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉంటే చాలని, ప్రజలు అది ఒక్కటి చేస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అన్నారు. 

 

ఆయన దండం పెట్టి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేయడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాయని ప్రజలు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండి సహకరించాలని మోడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఈ అర్ధ రాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అవుతుంది. ఏ ఒక్క వాహన౦ కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: