కరోనా భీభత్సం వల్ల లోకంలో పరిస్దితులన్ని ఊహించనంతా మారుతున్నాయి.. ఒక వైపు అధికారులు, వైద్య సిబ్బంది కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తుండగా విలేఖరులు కూడా వార్త సేకరణలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఇలా వీరితో పాటుగా ప్రజలు కూడా సహకారం అందిస్తే ఇప్పుడు లోకాన్ని భయపడతున్న కరోనా వ్యాధిని తరిమి వేయవచ్చూ.. కానీ దీనికి భిన్నంగా పరిస్దితులు నెలకొన్నాయి.. ఇకపోతే వార్తల సేకరణకు వెళ్తున్న సమయంలో ఒక జర్నలిస్టుపై పోలీసులు దాడికి పాల్పడ్ద ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

తెలంగాణ లాక్‌డౌన్ వేళ హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడికి దిగారు. ఓ పత్రికకు బ్యూరో చీఫ్ అయిన సీనియర్ జర్నలిస్టు వార్తల సేకరణకు వెళ్తుండగా, రామంతపూర్‌లో పోలీసులు ఆపి కొట్టారు. కాగా ఈ ఘటనను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించడమే కాకుండా, మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు... ఇక ఈ ఘటనపై స్పందించిన డీజీపీ. పోలీసులు జర్నలిస్టుల జోలికి రాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని, అంతే కాకుండా పోలీసుల ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు..

 

 

ఇదిలా ఉండగా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారిలో ఎవరికైన అక్రెడిటేషన్ కార్డులు లేకుంటే, వారికి ఆయా పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సీపీఆర్వో‌ల ద్వారా పాసులు జారీ చేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు.. ఇక ఇలాగే నగరంలో జర్నలిస్టులపై, మరో ఐదు చోట్ల  పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు జర్నలిస్టుల సంఘం సభ్యులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరిస్తూ, అక్రెడిటేషన్ కార్డులు అందరికి ఉండవని.. ముఖ్య పత్రికలు, ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టుల వద్ద మాత్రమే అక్రెడిటేషన్ కార్డులుంటాయని, అందువల్ల పోలీసులే గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు కోరారు... ఇకపోతే జర్నలిస్టు కూడా ఒక బాధ్యతగల వ్యక్తి అన్న విషయం గుర్తించాలని కోరారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: