ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌లాకుత‌లం చేసిన భ‌యంక‌ర‌మైన వ్యాధి క‌రోనా వైర‌స్‌. ఈ వ్యాధి సోకిన వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది న్యూమోనియాకు దారి తీసి.. శరీర అవయవాలపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

 

ఇక ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కొరుకు రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్ర‌లు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ రోడ్ల పైన ఎక్కువ‌గా జ‌నం తిర‌గ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. తెలంగాణలో 6 గంటలకే జనతా కర్ఫ్యూ ప్రారంభించి. హైదరాబాద్‌‌లోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉదయం పూట ఎల్లప్పుడూ రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఒక‌రి నుంచి ఒక‌రు ఎంత దూరంగా ఉంటే ఈ వ్యాధిని అంత త్వ‌ర‌గా త‌గ్గించ‌వ‌చ్చ‌ని వైద్య‌నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. అయితే దీన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌ని అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని ఇటు ప్ర‌భుత్వాలు, అటు సెలబ్రెటీలు ఎప్ప‌టిక‌ప్పుడు విష‌యాన్ని తెలియ‌జేస్తున్నారు.

 

ఇక ఇదిలా ఉంటే... ఒక మ‌నిషి సైకాల‌జీ ఎలా ఉంటుందంటే అది ఎవ‌రైనా స‌రే మ‌న‌మే బాగుండాలి. మ‌న‌ము మాత్ర‌మే బాగుండాలి. మ‌న‌మే బాగేప‌డాలి. మ‌న‌మే ఆరోగ్యంగా ఉండాలి. మ‌న‌మే సంపాదించుకోవాలి అన్న వైఖ‌రిలో ఉంటుంది. ఎల్ల‌ప్పుడూ స్వార్ధంగా నిండిపోయి ఉంటాడు మ‌నిష‌నేవాడు ఇక అది త‌ప్ప‌ని చెప్ప‌లేం. ఎందుకంటే అది ప్ర‌తి మ‌నిషిలోనూ ఉండే సైకాల‌జీ. మ‌నిషి యొక్క త‌త్వం దాదాపుగా అలానే ఉంటుంది. మ‌రి అలాంటిది ఇప్పుడు ఈ క‌రోనా వైర‌స్ సోకిన‌ప్పటి నుండి కూడా ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోక‌డంతో మ‌న‌కంటే కూడా ముందు ప‌క్క‌వాడు బావుండాలి. వాడికి ఎలాంటి జ‌బ్బు రాకూడ‌దు. వాడు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. బ‌హుశా ఇలా కోరుకోవ‌డం అనేది ఇదే మొద‌టిసారి జ‌రిగి ఉండ‌వ‌చ్చు. ఇప్పుడు వ‌ర‌కు ప్ర‌పంచంలో ఏ ఒక్క‌డూ ఇలా ఆలోచించ‌లేదు ఇదే మొద‌టిసారి జ‌రిగి ఉంటుంది. ఈ వైర‌స్ మ‌నిషి యొక్క సైకాల‌జీని కూడా మార్చేసిందిగా. ఎంత భ‌యంక‌ర‌మైన వ్యాధి ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: