ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. పార్లమెంటులో కచ్చితంగా ఈ బిల్లుకు ఆమోదం పొందుతుందని అందరూ భావించారు. జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అదేవిధంగా సీఆర్డీఏ రద్దు బిల్లు నీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో వైయస్ జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు...రాజకీయాలను అడ్డంపెట్టుకొని పెద్దల సభ అని పేరు పెట్టి పేదలకు మరియు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన రెండు బిల్లులను టీడీపీ అడ్డుకోవడం పట్ల ఆగ్రహిస్తూ మండలిని రద్దు చేయడం జరిగింది. అయితే మండలి రద్దు బిల్లు కేంద్రానికి పంపే రెండు నెలలు కావస్తోంది. ఖచ్చితంగా కేంద్రం ఈ బిల్లును రద్దు చేయడం గ్యారెంటీ అని వైసిపి నాయకులు భావించారు.

 

ఇటువంటి తరుణంలో సమావేశాలు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తనకు అవసరమైన బిల్లులు మాత్రమే ఆమోదించుకు౦ది. ఈ పార్లమెంట్ సెషన్ లో ఆ బిల్లును ప్రవేశ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం షెడ్యూల్ లో కూడా లేదు. అత్యంత వేగంగా పార్లమెంట్ సమావేశాలు ముగించింది. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 3 వరకు జరగాల్సి ఉంది. దీంతో సెంటర్ ఏంటి వైయస్ జగన్ కి ఆ రకమైన షాక్ ఇచ్చింది అన్ని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంపీల భద్రత దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని మరోపక్క వార్తలు వస్తున్నాయి. అయినా కానీ నెల రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని ఆమోదించడానికి ప్రయత్నం చేసిన ఈ రకంగా కేంద్రం షాక్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం అంటూ మరోపక్క వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: