తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో  తెలంగాణ ప్రభుత్వం వైరస్ ను కంట్రోల్  చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలందరూ కేవలం ఇళ్ల కు మాత్రమే పరిమితం కావాలని  ప్రభుత్వం విధించిన నిబంధనను అందరూ పాటించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించకుండా చాలామంది లాక్ డౌన్  విధించినప్పటికీ బయటకు రావడంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు మీద మనిషి కనిపిస్తే చాలు చితకబాదారు పోలీసులు. కనీసం మనుషులు అని కూడా చూడకుండా అతి దారుణంగా ప్రవర్తించారు. 

 


 దీనిపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. లాఠీఛార్జి చేయడం మంచిదే కానీ చేయడంలో కూడా ఒక పద్ధతి పాటిస్తే బాగుంటుంది అంటున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించిన తర్వాత ఒక్కరోజే కదా అని దేశ ప్రజానీకం మొత్తం జనతా కర్ఫ్యూను ప్రకటించింది.. ఇదే సమయంలో జనతా కర్ఫ్యూ పూర్తి కాకముందే ఇక చాలా రోజుల వరకూ ఏమి  అందుబాటులో ఉండదు అనే సరికి  ప్రజలందరూ అయోమయంలో పడ్డారు.. అందుకే నిత్యవసర వస్తువులు తీసుకోవడానికి రోడ్ల మీదికి వస్తుంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది అత్యవసరం కారణంగా కూడా రోడ్ల మీదికి వస్తుంటారు.

 

 ప్రజలు ఎందుకు బయటకి వచ్చారో  కారణం తెలుసుకోకుండా నిర్ధాక్షణ్యంగా లాఠీఛార్జ్ చేయడం దారుణం  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఆవారాగా తిరుగుతూ పని పాట లేకుండా రోడ్ల మీదికి వచ్చే వారిపై లాఠీఛార్జ్ చేయడం కేసులు పెట్టడం సరైనది అంటున్న రాజకీయ విశ్లేషకులు... గత్యంతరం లేక అవసరాలకోసం రోడ్డు మీదికి వచ్చిన వారిపై కనీసం కారణం కూడా తెలుసుకోకుండా లాఠీకి పని చెప్పడం దారుణమన్నారు. ఇలా అత్యవసరాలు కోసం బయటికి వస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక ప్రత్యామ్నాయం చూపించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: