తెలుగు రాష్ట్రాల్లో కరోనా  రోజురోజుకు ఎక్కువవుతున్న  విషయం తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రంలో 30కిపైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరొన  వైరస్ కేసులు 10కి  చేరువలో ఉన్నాయి . కరోనా వైరస్ ను  అరికట్టేందుకు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి  సర్కార్ ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు కరోనా  పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా పై  ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఆకతాయిలపై కఠినంగా వ్యవహరిస్తామని  ఆంధ్రప్రదేశ్ డిజిపి ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిజిపి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేయాల్సి వస్తే ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అంటూ పేర్కొన్నారు. కరోనా  వైరస్ మీద అబద్ధాలు ప్రచారం చేస్తే రెండేళ్లు జైలుశిక్ష విధిస్తాము  అంటూ హెచ్చరించారు.. మరి జగన్ గారికి రెండేళ్ల జైలు శిక్ష ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎన్నికలె  ముద్దు అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు  అంటూ ఆరోపించారు బుద్ధ వెంకన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కరోనా  వైరస్ అనేది లేదు అని ఎన్నికలు నిర్వహించండి అంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. 

 

 

అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లేదు అంటూ తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై  మొదట చర్యలు తీసుకోవాలంటూ బుద్ధ వెంకన్న సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టును సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేశారు అంటూ మండిపడ్డారు బుద్ధా  వెంకన్న. కరోనా  వస్తుంది పోతుంది దాని గురించి ఎక్కు వగా భయపడాల్సిన అవసరం లేదు అంటూ...పారాసిటమాల్ తో  తగ్గిపోతుంది బీజింగ్ పౌడర్ తో  చచ్చిపోతుంది స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు  చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అంటూ బుద్ధా  వెంకన్న వ్యాఖ్యానించారు. అందుకే మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అంటూ బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: