తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 30కిపైగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే మొన్నటి వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో   కూడా కరోనా  వైరస్  లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా వైరస్ ను  నియంత్రించేందుకు కేసిఆర్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను  రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు కేవలం ఇళ్లకే పరిమితం కావాలి అంటూ కేసిఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్  ప్రకటించారు. 

 

 

 ఇలాంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి రేషన్ కార్డు వెంట 1500 రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ నిర్ణయించింది . అయితే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించినప్పటికీ... చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా రోడ్లమీద తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మొత్తం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి అంటూ సూచించారు. చాలా మంది ప్రజలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని... ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్యం కోసమే ఇలా చేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. 

 

 

 అయితే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో... కొన్ని పనులకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని పల్లెటూర్లలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి రైతులకు వెసులుబాటు కల్పిస్తున్నాము  అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారు కూడా గుంపులు గుంపులుగా ఒకేచోట ఉండి పని చేసుకోకుండా... సామాజిక దూరం పాటించి పనులు చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా చేసుకోవచ్చు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: