మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారులు వస్తున్నారు, కలెక్టర్లు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, మున్సిపాలిటి సిబ్బంది వస్తున్నారు. కాని ప్రజా ప్రతినిధులు మాత్రం బయటకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులు బయటకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు. ప్రజలు అందరూ కూడా పోలీసులకు సహకరించాలని అదే విధంగా పోలీసులకు నాయకుల నుంచి సహకారం అందాలని కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. మనం ఎం చేస్తున్నామో ప్రజలు కచ్చితంగా చూస్తారని అన్నారు. 

 

ఆయన మాటలు నిజం అంటున్నారు పలువురు. ఇన్నాళ్ళు నాయకులకు బయటకు వచ్చే అవసరం దాదాపుగా రాలేదు అనే చెప్పాలి. ఇప్పుడు కచ్చితంగా బయటకు రావాలి. అందుకే కెసిఆర్ ఆ ఆదేశాలు అందరికి ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా నాయకులు బయటకు రావాలని, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి తమ వంతు సహకారం అధికార యంత్రాంగానికి అందించాలి అని కోరుతున్నారు. జగన్ ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని, సిఎం గా ఆయన ఆదేశాలు ఇస్తే వాటిని కచ్చితంగా అమలు చేస్తారని అంటున్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఇది మంచి అవకాశమని అంటున్నారు. 

 

కరోనా అనేది కేవలం ప్రభుత్వాలు అధికార యంత్రాంగం మాత్రమే అడ్డుకునే వ్యవహారం కాదు. ప్రజలు, వాళ్ళతో ఓట్లు వేయించుకున్న నాయకులు అందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఎమ్మెల్యే ఎంపీ అందరూ బయటకు రావాలి. ఎవరికి వాళ్ళు స్వచ్చందంగా ముందుకి వస్తే కరోనా వైరస్ ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం దాన్ని అడ్డుకోవడం అనేది దాదాపుగా సాధ్యం కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది సాధారణ వ్యాధి కాదని దాన్ని లైట్ తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు. కాబట్టి నాయకులు కూడా బయటకు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: