మూడు వారాల పాటు దేశం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ చేసేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారిగా  దేశమంతా ఒక్కసారిగా ఎందుకు లాక్ డౌన్ చేసేసింది ? ఎందుకంటే జనాలందరికీ కొరోనా వైరస్ పరీక్షలు జరపటానికి, రోగులను ఉంచటానికి హాస్పిటల్స్ ,  బెడ్లు, క్వారంటైస్ సెంటర్లు లేవు కాబట్టే ముందు జాగ్రత్తగా కేంద్రం లాక్ డౌన్ అని ప్రకటించేసింది. ప్రస్తుతం దేశంలో  423 మందికి వైరస్ సోకగా తొమ్మిది మంది చనిపోయారని చెబుతున్నారు.

 

ఇక్కడ సమస్య ఏమిటంటే లక్షణాలున్న వారిని అందరినీ పూర్తిగా పరీక్షలు చేయటానికి నిర్ధారించటానికి సరిపడా మన దగ్గర వైద్యపరికరాలు లేవు. దేశంలోని జనాభా సంఖ్యతో పోల్చుకుంటే  అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆసుపత్రులు, మందులు, పరీక్షల కేంద్రాలు, స్టాఫ్ చాలా చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాలోనే పరీక్షలు  చేయటం, కొరోనా వైరస్ సోకిందని నిర్ధారించిన వారిని ఉంచటానికి బెడ్లు, వెంటిలేటర్లు తదితరాలు లేక అల్లాడిపోతున్నారు.

 

అమెరికానే కొరోనావైరస్ కారణంగా ఇడ్బంది పడుతోందంటే ఇక మనదేశం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అమెరికా కొరోనా వైరస్ విషయంలో ఇంత అవస్తలు పడుతోంది ? ఎందుకంటే అమెరికాలో వాడే సమస్త మెడికల్ ఎక్విప్మెంట్ అంటే వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు,  మందులు చివరకు మాస్కుల్లాంటివి కూడా అమెరికాకు చైనా నుండే వస్తుంది. అలాంటి చైనా వైరస్ కారణంగా ఒక్కసారిగా కూప్ప కూలిపోవటంతో అమెరికా ఇబ్బందుల్లో పడిపోయింది.

 

ఒక్క అమెరికా మాత్రమే కాదు ఇండియా చూడా చాలా విషయాల్లో చైనా మీదే ఆధారపడుంది. వైరస్ కారణంగా అమెరికానే ఇబ్బంది పడుతోందంటే ఇక భారత్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనదేశంలో వైరస్ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉందంటే మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని  అనుకునేందుకు లేదు. వైరస్ సోకిన లక్షణాలు లేవు కాబట్టే   అందరికీ పరీక్షలు చేయటం లేదు. ఒకవేళ పరీక్షలు చేయాలన్నా అందుకు సరిపడా వైద్య పరికరాలు లేవు. ఒకవేళ నిజంగానే ర్యాండంగా అందరికీ పరీక్షలు చేస్తే అపుడు బయటపడుతుంది అసలు రోగుల సంఖ్య. ఈ గొడవలన్నీ పడలేక, జనాలు బయటతిరగకపోతే కొరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ముందు జాగ్రత్తగా మూడు వారాల పాటు దేశం మొత్తాన్ని కేంద్రం లాక్ డౌన్ చేసేసింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: