నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి కరోనా నివారణకై చేసిన ప్రసంగంలో వరుసగా మూడు వారాలపాటు దేశం మొత్తం పూర్తి లాక్ డౌన్ కు సహకరించాలని విన్నవించుకున్న విషయం తెలిసిందే. అయితే మోడీ తన ప్రసంగంలో పూర్తి లాక్ డౌన్ అంటే కర్ఫ్యూ అలాంటిదే అని ప్రకటించిన ప్రజలంతా ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇకపై తాము 21 రోజులు అసలు బయటికి వెళ్లకుండా బయట ఏమీ దొరక్కుండా ఎలా జీవించాలి అని వారంతా ఆందోళన ఆందోళన చెందగా మోడీ వారి అనుమానాలను తీర్చేందుకు తన సోషల్ మీడియాలో నిత్యావసర వస్తువులు మరియు మందుల షాపులు, బ్యాంకులు ఇంకా ఏటీఎంలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి అని చెప్పి కొద్దిగా ఉపశమనం కల్పించారు.

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీద జనాలు వస్తే లాటీలు పట్టుకుని చితక్కొట్టేందుకు పోలీసులు అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంటి నుంచి ఒకరు నిత్యావసర వస్తువులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఇప్పుడు ముఖ్యమంత్రి యొక్క అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ వి రమేష్ కొత్త విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచించారు. కరోనా విషయంలో ఆందోళన వద్దని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఆయన వైద్య సేవలు అందించేందుకు రిటైరయిన డాక్టర్లు మరియు వివరాలను సేకరిస్తున్నామని కూడా చెప్పారు.

 

 

ఇకపోతే గ్రామాల్లోనూ నియంత్రణ ఎక్కువగా ఉందని కొనియాడిన ఆయన నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచి ఉంటే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు.... అది కుదరని పక్షంలో తోపుడుబండ్ల ద్వారా నిత్యావసర వస్తువులను ఇళ్ళ వద్దనే అందించే ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామ వాలంటీర్ల ఇళ్లకు నిత్యావసర వస్తువులను తోపుడు బండ్ల పైన తీసుకుని వచ్చేలా తమ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: