కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా ఒకవైపు వేలాది ప్రాణాలను బలి తీసుకుంటుంటే అమెరికా యువత మాత్రం అసలు ఏమాత్రం వైరస్ ను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తూ ఉండగా సోమవారం ఒక్కరోజే వెయ్యి మందికి పైగా అమెరికాలో కరోనా సోకింది. ఏకంగా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అమెరికాకు చెందిన కొందరు యువకులు ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో ఏకంగా పార్టీ చేసుకున్నారు.

 

 

ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా సమరు యువత పార్టీకి సిద్ధం కాగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారంతా కలిసి పోలీసులు నిలువరించి అసలు యువతకి కరోనా ఎఫెక్ట్ లేదు కదా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అమెరికా దేశ ప్రజలందరిలో కలకలం రేపుతోంది. సందర్భంగా కరోనా గురించి ఒక యువకుడికి వివరించే ప్రయత్నం ఒక మీడియా ప్రతినిధి చేయగా "నాకు కరోనా వస్తే రానివ్వండి కానీ నేను మాత్రం పార్టీ చేసుకోవడం ఆపను" అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఖంగుతినడం మీడియా ప్రతినిధి వంతయింది

 

 

కరోనా  భయంతో ప్రపంచ దేశాలన్నీ స్వీయ నియంత్రణను పాటిస్తుంటే... అమెరికా లో అంత మారణకాండ జరుగుతున్నాప్రభుత్వం ఇంకా లాక్ డౌన్ ప్రకటించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే... చిన్న పిల్లలు వృద్దులపైనే కరోనా ప్రభావం చూపుతుందన్న మాటలోనూ వాస్తవం లేదని తెలస్తోంది. అమెరికాలో ఇప్పటిదాకా 2500 మందికి కరోనా సోకగా.. వారిలో 20 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారని అక్కడి విశ్లేషణలు చెబుతున్నాయి. 38 శాతం మంది 20 నుంచి 54 ఏళ్లలోపు ఉన్న వారేనని కూడా నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: