ప్రస్తుతం ప్రపంచమంతా శ్మశానం చేసే ఆలోచనలో ఉంది ఓ వైరస్. అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. ప్రజలందరినీ వణికిస్తోంది.. ఈ వైరస్ కు మందు లేకపోవడం ఒక కారణం అయితే.. వ్యాప్తి చెయ్యకుండా ఆపలేకపోవడం ఒక కారణం. ఇది నిజంగా చైనాలోని వుహాన్ నగరంలో పుట్టినప్పటికీ చైనా కంటే కూడా ఇటలీలోనే మరణాలు ఎక్కువ సంభవించాయి.. 

 

ఇప్పటికే ఇటలీ శ్మశానవాటికలా తయారయ్యే స్థితిలో ఉంది. ఇంకా అమెరికాలో అయితే ఏకంగా 10వేల కేసులు పాజిటివ్ వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షలమందికిపైగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.. 18వేలమంది ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్నీ మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాలా నిజం.

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో భారత్ లోకి అడుగు పెట్టి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీంతో దేశప్రజలు అంత కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి అని.. ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని.. ఒక్క ఆరోగ్య సమస్యలకు తప్ప బయటకు రాకూడదు అని దేశం లాక్ డౌన్ విధించింది. 

 

అలాంటి ఈ సమయంలో అక్కడ లాక్ డౌన్ ఎత్తేశారు.. ఎక్కడ? ఎందుకు ఎత్తేవేశారు? వాళ్ళకు ఏమైనా పిచ్చ? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మొట్టమెదట లాక్ డౌన్ విధించిన ప్రదేశం చైనాలోని వుహాన్ నగరం. అలా లొక్డౌన్ విధించి కరోనా వ్యాప్తిని అరికట్టింది. ఇపుడు అదే చోటా లాక్ డౌన్ ఎత్తివేసింది. కారణం అక్కడ కరోనా వైరస్ అంతం అయ్యింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వుహాన్ లో ఒక్కో చోటా ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తూ వస్తుందట.. అయితే ఈ లాక్ డౌన్ ఎత్తి వెయ్యడం అంత మంచిది కాదు అని కరోనా వైరస్ మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూండటం గమనార్హం. మరి అసలు చైనా ఎం చెయ్యాలి అనుకుంటుందో ఏమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: