తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మరోసారి తన గొప్ప వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు.  ఆంధ్రాకు చెందిన ఒక యువతి, ట్విట్టర్ ద్వారా తన భాధను కేటీఆర్ కు విన్నవించుకుంది. అందుకు కేటీఆర్ వెంటనే స్పందించారు. అసలు ఆమె సమస్య ఏంటంటే...

 

 

ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన యువతి. ఉద్యోగ ప్రయత్నం కోసం ఆమె కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగినా, ఫలితం లేదు. ఇంక చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో, హఠాత్తుగా హైదరాబాద్ మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో బస్సులు, రైళ్లు, ఇలా ఇతర రవాణా సర్వీసులన్నీనిలచిపోయాయి. ఇక ఆమెకు ఎటు వెళ్లలేని పరిస్థితి. ఇంతలో ఆమె తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోయే స్థితికి వచ్చింది. తినడానికి తిండి లేక, ఉండడానికి వసతి లేక ఆమె చాలా ఇబ్బందులు పడుతోంది. ఆమెకు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇక తన పరిస్థితిని ఎలాగైనా మంత్రి కేటీఆర్ కు తెలిజేయాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు ఆమె ట్విట్టర్ ను ఉపయోగించి ఒక్క ట్వీట్ తో, తన సమస్యను కేటీఆర్ కు తెలిసేలా చేసింది.

 

 

ఆమె తన ట్వీట్లో "మాది ప్రకాశం జిల్లా. నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుండి తినడానికి తిండి లేదు. ఉండడానికి సురక్షితమైన చోటు కూడా లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి నాకు సహాయం చేయండి" అని పేర్కొంది. ఆ ట్వీట్ మంత్రి కేటీఆర్ చెంతకు చేరడంతో ఆయనే స్వయంగా స్పందించారు. “బాధపడకు చెల్లెమ్మ! మా బృందం నీకు సహాయం చేస్తుంది” అని తన ట్వీట్ ద్వారా ఆమెకు అభయమిచ్చారు. ఆయన ట్వీట్ చాలా మందిని కదిలించింది. వాళ్ళు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సిటీ పోలీసులు కూడా ఆమె వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని మంత్రి కేటీఆర్ నిరూపించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనను చాలా మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: