గ్రామాలూ కాదు.. రాష్ట్రాలు కాదు.. దేశాలు కాదు.. ప్రపంచమే వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుంది? ప్రపంచమే వణికిపోయేంత ఉందా? అంటే... ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ అంత డేంజరస్. అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి ప్రజలను పిక్క తింటుంది. 

 

ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా మన భారత్ లో 11 మంది మృతి చెందారు.. 581 కేసులు పైగా కరోనా పాజిటివ్ వచ్చాయి. ఇక అలాంటి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలమందికిపైగా ప్రజలకు ఈ కరోనా వైరస్ వ్యాపించగా అందులో లక్షమంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.. 19 వేలమంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. 

 

ఇక అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోను వేగంగా వ్యాపిస్తుండటంతో.. ఇరాన్.. ఇటలీ.. చైనా దేశాలలా కాకుండా మన ప్రజలను మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వరుకు బయటకు రాకూడదు అని.. వచ్చారు అంటే జైలుకు వేస్తాం అని.. ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకొని.. శుభ్రంగా ఉండండి అంటూ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తి కోరుకుంది. 

 

కానీ ప్రజలు వింటారా? అసలు వీళ్లకు భయం ఉందా? పోయేకాలం వచ్చింది అని అంటున్నారు నెటిజన్లు. అసలు ఎందుకు? ఆలా తిడుతున్నారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. కరోనా వ్యాప్తిని ఆపే నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంటే విజవాడలో ప్రజలు మాత్రం కరోనాకు అసలు భయపడటం లేదు.. కరోనా లేదు ఏమి లేదు.. మేము ఇంట్లో ఉండేదే లేదు అన్నట్టు విజయవాడ ప్రజలు వ్యవహరిస్తున్నారు. 

 

ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రికెట్ స్టేడియం, అజిత్‌సింగ్ నగర్‌లోని మల్టీపర్పస్ స్టేడియంల్లో కూరగాయలను ప్రజలు ఎలా విక్రయిస్తున్నారో చుడండి. కూరగాయలు కొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇలా ఎగబడుతున్నారు. ఇలా ఉంటె కరోనా ఎప్పుడు తగ్గుతుంది? మీరే చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: