దేశమంతటా ఒక్కటవ్వాల్సిన లాక్ డౌన్‌ సమయంలో కూడా కొందరు తమ స్వార్థ బుద్ధిని చూపిస్తున్నారు. ఛాన్సు దొరికింది కదా అని రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. అదేమైనా అంటే.. లాక్ డౌన్ సరుకులు దొరకడం లేదు. మీ ఇష్టమైతే కొనండి.. లేకపోతే లేదు అంటూ జులుం చేస్తుంటారు. దీంతో సామాన్య జనం జేబులు ఖాళీ అవుతున్నాయి.

 

 

లాక్ డౌన్ తో పనులు దొరక్క ఆదాయం లేక ఓవైపు సమస్య ఉంటే.. ఇలాంటి వ్యాపారుల కక్కుర్తితో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమస్య లేకుండా జగన్ సర్కారు ఓ ఏర్పాటు చేసింది. ఇకపై నిత్యావసరాల ధరలు పెంచితే 1902 నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు.. వాళ్లు తిక్క కుదురుస్తారు. అప్పటికీ ఇంకా రేట్లు పెంచి అమ్ముతూ ఉంటే.. తగిన చర్యలు తీసుకుంటారు.

 

 

రేట్లు పెంచిన వాళ్ల వివరాలు నమోదు చేసుకుని.. ఆ తర్వాత వాళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. వాస్తవానికి ఇలా సరుకుల ధరలు కొరత వల్ల పెంచుతారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ధరలు పెంచారంటే అది వ్యాపారుల లాభాల కోసమే అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో పోనీలే ఏం చేస్తామని ఊరుకోకుండా ఒక్కసారి 1902కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

 

 

మీరు ఇలా చేస్తే.. మీరే కాదు.. ఆ ప్రాంతంలోని మిగిలిన వారు కూడా మీ చర్య వల్ల లాభపడతారు. ఏదో ఒక పరిస్థితిని అడ్డు పెట్టుకునేవారిని ప్రశ్నిస్తేనే వారు దారికొస్తారు లేకపోతే ఇంకా రెచ్చిపోతారు. అందుకే ఇకపై ప్రశ్నించడం నేర్చు కోండి. లేకపోతే ఈ లాక్ డౌన్ పూర్తయ్యే లోగా మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.. ఏమంటారు.. ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: