తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవ‌రైనా ఏదైనా సాయం కావాలంటూ ట్వీట్ చేస్తే వెంట‌నే స్పందించి, అవ‌స‌ర‌మైన సాయం అందించ‌డంతో ఆయ‌న ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉంటారు. ఇలా ఇప్ప‌టికే అనేక మంది ఆప‌ద స‌మ‌యంలో ట్వీట్ చేసి, సాయం పొందారు. తాజాగా.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌కాశం జిల్లాకు చెందిన సుహాసిని అనే అమ్మాయి హైద‌రాబాద్‌లో ఉండిపోయింది. ఉద్యోగం వెతుక్కునేందుకు వ‌చ్చిన ఆ అమ్మాయి.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో వెంట‌నే ఆమె తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. 

 

*ఉద్యోగం చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఎటూ వెళ్ల‌డానికి ఇక్కడే ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుంచి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నా.. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు నాకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. నేను తిరిగి మా ఊరి వెళ్ల‌డానికి సాయం చేయండిస అన్నా అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌సౌ మంత్రి కేటీఆర్ వెంట‌నే స్పందించారు. *చెల్లెమ్మా! ఆందోళన చెందకు. మా బృందం నీకు సహాయం అందిస్తుంది* అంటూ ఆయ‌న అభయం ఇచ్చారు. అలాగే.. లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి అనేక మంది మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు చేస్తున్నారు. త‌మ‌కు సాయం అందించాలని కోరుతున్నారు. లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. నిత్యావ‌స‌రాలు కూడా పెద్ద‌గా అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌వేళ వెళ్లినా కూడా పోలీసులు చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుల‌కు ఎలాంట ఇబ్బందులు లేకుండా.. అత్య‌వ‌స‌ర సేవ‌లు అందిస్తామ‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: